• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY LIKELY TO START RACHABANDA FROM UGADI BA

YS Jagan: వైఎస్ఆర్‌ ప్రారంభించలేకపోయిన కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్న జగన్.. ఎప్పటి నుంచంటే..

YS Jagan: వైఎస్ఆర్‌ ప్రారంభించలేకపోయిన కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్న జగన్.. ఎప్పటి నుంచంటే..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయన 16 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నా.. చివరకు ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ అయింది. అది రచ్చబండ కార్యక్రమం.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయన 16 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నా.. చివరకు ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ అయింది. అది రచ్చబండ కార్యక్రమం. ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి?. ప్రజల సమస్యలను అధికారులు ఎంత త్వరగా పరిష్కారం చేస్తున్నారు? ఒకవేళ పరిష్కారం చేయకపోతే వెంటనే వాటిని పరిష్కరించేలా అధికారులకు అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వనున్నారు.

    2019 మేలో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే సంవత్సరం నవంబర్‌లోనే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. 2020 జనవరి లేదా ఫిబ్రవరిలోనే దీన్ని ప్రారంభించాలనుకున్నారు. అది కూడా వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అడుగు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ‘కరోనా తగ్గిన తర్వాత రచ్చబండ స్టార్ట్ చేద్దాం.’ అని చెప్పారు.



    ప్రస్తుతం కరోనా వైరస్ కొంత మేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కేవలం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కూడా వేగంగా జరుగుతోంది. దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మెరుగైన ప్రజా పాలన జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావిస్తోంది. అందుకే ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించనుంది.



    వాస్తవానికి ఈ రచ్చబండ కార్యక్రమం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభం కావాల్సి ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లా వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో వైఎస్ఆర్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు