'నాడు-నేడు'కు నేడే జగన్ శ్రీకారం.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ..

Nadu-Nedu : మూడేళ్ల కాలంలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

news18-telugu
Updated: November 14, 2019, 11:58 AM IST
'నాడు-నేడు'కు నేడే జగన్ శ్రీకారం.. ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన 'నాడు-నేడు' కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించనున్నారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు,సదుపాయల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. విద్యారంగంపై ఖర్చును సామాజిక పెట్టుబడిగా.. భవిష్యత్‌లో మానవ వనరుల అభివృద్దిగా చూడాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు.

మూడేళ్ల కాలంలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ.12,000 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదటి దశ కింద 15715 పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నానరు.ఇందుకోసం రూ.3627కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో గ్రామీణ,గిరిజన, పట్టణ,గురుకుల పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కలెక్టర్లు నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతారు.పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అనంతరం ఫోటోలు తీసి వాటిని ప్రభుత్వ పోర్టల్‌లో పొందుపరుస్తారు. ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక స్కూళ్లు ఎలా మారిపోయాయి అన్న తేడాను ఫోటోల ద్వారా ప్రజలకు చూపించనున్నారు.First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com