Home /News /politics /

YS Jagan: 2024 ఎన్నికల ప్లాన్ బయటపెట్టిన సీఎం జగన్.. మంత్రులతో కీలక వ్యాఖ్యలు..

YS Jagan: 2024 ఎన్నికల ప్లాన్ బయటపెట్టిన సీఎం జగన్.. మంత్రులతో కీలక వ్యాఖ్యలు..

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

YS Jagan: కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో పలు రాజకీయపరమైన అంశాలపై మాట్లాడిన సీఎం జగన్.. 2024లో జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని మంత్రులుకు సూచించారు.

    2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన పరిపాలన సరిగ్గా లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. ఆయన మాత్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అందుకోసం ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గురువారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం జగన్ పంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో పలు రాజకీయపరమైన అంశాలపై మాట్లాడిన సీఎం జగన్.. 2024లో జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని మంత్రులుకు సూచించారు.

    మంత్రులు ఏదో అంశంపై జనంలో ఉండాలని.. వచ్చే ఏడాది నుంచి తాను కూడా పూర్తిస్థాయిలో జనంలోనే ఉంటానని ఆయన మంత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మరో కీలకమైన అంశాన్ని కూడా మంత్రులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తన విజయానికి తనదైన వ్యూహాలతో బాటలు వేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. మరోసారి వైసీపీ కోసం పని చేయబోతున్నట్టు సీఎం జగన్ వారికి సమాచారం వచ్చారు. వచ్చే ఏడాది పీకే టీమ్ రంగంలోకి దిగుతుందని ఆయన మంత్రులకు వివరించారు.

    ఎన్నికలు 2024లో జరిగినా.. లేక అంతకుముందే వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన మంత్రులకు స్పష్టం చేశారు. పీకే టీమ్ రంగంలోకి దిగిన తరువాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపై పూర్తి క్లారిటీ వస్తుందని.. ఆ తరువాత ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే దానిపై సీఎం జగన్ అండ్ టీమ్ మరింత కూలంకషంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Telangana BJP: కేంద్రమంత్రిపై తెలంగాణ బీజేపీ అసహనం.. ఇలా చేస్తే ఎలా అంటూ..

    Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్.. సైలెంట్ అయిన సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో చర్చ

    గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్.. ఆ తరువాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ కోసం పని చేసింది. వారు మరోసారి అధికారంలోకి రావడంలో తమ వంతు పాత్ర పోషించింది. తాజాగా పీకే టీమ్ మరోసారి ఏపీలో వైసీపీ కోసం రంగంలోకి దిగనుండటంతో.. వచ్చే ఏడాది నుంచే ఏపీలో ఎన్నికల హీట్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Prashant kishor, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు