హోమ్ /వార్తలు /politics /

YS Jagan Holiday Tour: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం జగన్... మళ్లీ ఎప్పుడొస్తారంటే..!

YS Jagan Holiday Tour: హాలిడే ట్రిప్ కి వెళ్లిన సీఎం జగన్... మళ్లీ ఎప్పుడొస్తారంటే..!

ఎయిర్ పోర్టులో సీఎం జగన్ దంపతులు

ఎయిర్ పోర్టులో సీఎం జగన్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) తన అధికారిక కార్యక్రమాలకు బ్రేక్ ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి హాలిడేకు వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) తన బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఐదు రోజుల హాలిడే ట్రిప్ ఆయన కుటుంబ సమేతంగా సిమ్లా వెళ్లారు. నిత్యం పరిపాలనా వ్యవహారాలు, పార్టీ కార్యకలాపాలుతో తీరికలేకుండా గడుపుతున్న ఆయన బ్రేక్ తీసుకోవాలని భావించారు. ముఖ్యంగా సీఎం అయన తరువాత ఆయన తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండి.. కుటుంబానికి సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకు తన పెళ్లి రోజును మంచి తరుణంగా తీసుకున్న ఆయన... నార్త్ ఇండియా టూర్ వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి (Tadepalli)లోని నివాసం నుంచి గన్నవరం (Gannavaram) విమానాశ్రయం నుంచి చండీగఢ్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్ కు చేరుకున్నారు.

ఈ ఫ్యామిలీ టూర్ కు ప్రధాన కారణం.. సీఎం జగన్-భారతిల వివాహ వార్షికోత్సవమే. ( YS Jagan - Bharathi Wedding Anniversary) ఈ నెల 28న జగన్ పెళ్లి పెళ్లిరోజు. సరిగ్గా ఆ రోజుకు వారి పెళ్లి అయ్యి 25 ఏళ్లు పూర్తవుతుంది. 25 ఏళ్ల ప్రేమ బంధాన్ని గ్రాండ్ గా జరుపుకోవాలని భావిస్తున్నారు.. దీన్ని పురస్కరించుకుని సీఎం జగన్ కుటుంబంతో కలిసి సిమ్లా టూర్ ప్లాన్ చేశారు. పెళ్లి రోజుతో సహా.. మరో నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో సీఎం జగన్ గడపనున్నారు. ఐదు రోజుల తర్వాత సీఎం జగన్ తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 30న కానీ 31న ఆయన తిరిగివచ్చే అవకాశముంది.

ఇది చదవండి: ఏపీలో స్కూళ్లను వీడని కరోనా... తాజాగా మరికొందరికి వైరస్..


ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన పర్యటనలకు వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections-2019) ముగిసిన తర్వాత సీఎం జగన్ కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అలాగే జెరూసలెం యాత్రకు (Jerusalem Tour) కూడా వెళ్లారు. నిజానికి ఈసారి కూడా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన కొవిడ్ దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సీఎం జగన్ తొలుత యూరప్ పర్యటనకు (Europe Tour) వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ సిమ్లా టూర్ వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్ర అక్కడికి చేరుకున్నారు.

ఇది చదవండి: ఏపీలో విచిత్రం.. రాత్రికి రాత్రే సముద్రం మాయం.. అసలేం జరిగిందంటే..!


సిమ్లా వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్ కొత్తలుక్ లో దర్శనమిసచ్చారు. ఎప్పుడూ వేసుకునే డ్రెస్ వేసుకున్న ఆయన.. మెడలో స్వెట్టర్ తో కనిపించారు. ఆయన పక్కన సతీమణ భారతి కూడా ఉన్నారు. ఐదు రోజుల పాటు సీఎం జగన్ తన అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు