ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY PLANNING TO TOUR IN DISTRICTS FROM HIS BIRTHDAY FULL DETAILS HERE PRN
YS Jagan: ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్..? ముహూర్తం ఆ రోజేనా..?
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం (AP CM Camp Office) నుంచే చేపడుతున్నారు. కరోనా కారణంగా బహిరంగ కార్యక్రమాలకు, పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం (AP CM Camp Office) నుంచే చేపడుతున్నారు. కరోనా కారణంగా బహిరంగ కార్యక్రమాలకు, పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదు. ఐతే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావడం, చాలా రోజులుగా క్యాంప్ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తుండటంతో ఆయన తన వ్యూహాన్ని మార్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు మూడు నెలలుగా ప్రజల్లోకి వెళ్లి రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నా ఎందుకో ముందడుగు పడటం లేదు. దీంతో ఓ మంచి రోజు చూసుకొని గ్రామ, వార్డు సచివాలయాల సందర్శనకు వెళ్లాలని సీఎం అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల పర్యటనకు తన పుట్టిన రోజైన డిసెంబర్ 21నాడే ముహుర్తం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సంక్షేమ పథకాల అమలు తీరు, లోపాలు, ప్రజల్లో నెలకొన్న సంతృప్తి, ప్రజాప్రతినిథుల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలపై నివేదికలు తెప్పించుకొని తదనుగుణంగా జిల్లాల్లో పర్యటించాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన పర్యటనలకు సంబంధించిన విధివిధానాలను స్వయంగా తానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను అధికారులు, పార్టీ ముఖ్యనేతలకు కూడా ఆయన వెల్లడించలేదట.
వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అధికారిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ప్రారంభానికి తప్ప ప్రజలతో నేరుగా ముఖాముఖి అయిన సందర్భాలు లేవు. ప్రస్తుతం వర్చువల్ ద్వారానే వివిధ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ఇక సచివాలయాలను సందర్శించేటప్పుడు స్థానికులతో వివిధ అంశాలపై ఆయన మాట్లాడే అవకాశముంది. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి..? గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు సక్రమంగా అందుతున్నాయా..? వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారా..? పథకాల కోసం ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తున్నారా..? విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని సమస్యలపై జగన్ ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
కేటగిరీలుగా జిల్లాలు..
పర్యటనలకు వెళ్లే ముందే రాష్ట్రంలోని 13 జిల్లాలను వివిధ కేటగిరీలుగా విభజించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయా జిల్లాల్లో పథకాల అమలు, ప్రజాప్రతినిధుల పనితీరు, అధికారుల పర్యవేక్షణ అధారంగా చేసుకొని జిల్లాలను విభజించనున్నట్లు సమాచారం. ఇలా తాను అనుకున్న బెంచ్ మార్క్ చేరుకున్న జిల్లాలు ఒకలా.. దగ్గరగా ఉన్న జిల్లాలు మరోలా, దూరంగా ఉన్న జిల్లాలను మరో కేటగిరీగా విభజించి అలాంటి జిల్లాలపై మరింత దృష్టి పెట్టనున్నారట. ప్రభుత్వ విధానాలు, పథకాల్లో లోపం ఎక్కడున్నా కఠిన చర్యలు తీసుకునేలా సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుసతోంది.
తన పర్యటనలు మొదలయ్యేలోగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులను కూడా పూర్తి చేసి కొత్త టీమ్ తో ప్రజల్లోకి వెళ్తారన్న మాట కూడా వినిపిస్తోంది. డిసెంబర్ రెండో వారానికి కేబినెట్ మార్పు పూర్తి చేస్తారని తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.