హోమ్ /వార్తలు /politics /

YS Jagan on Capital: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన

YS Jagan on Capital: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడు రాజధానుల బిల్లు రద్దుపై (3 capitals bill) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan reddy) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మూడు రాజధానుల బిల్లు రద్దుపై (3 capitals bill) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan reddy) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. తన ఇల్లు కూడా ఉందన్నారు. నిజానికి ఈ ప్రాంతమంటే తనకు ప్రేమ ఉందన్నారు. రాజధాని ప్రాంతం అటు గుంటూరు, విజయవాడలో లేదన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రూ.లక్ష కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పిందన్నారు.

ఈ రోజు అయ్యే రూ.లక్ష కోట్ల ఖర్చు పదేళ్ల తర్వాత 6,7 లక్షల కోట్లు అవుతుందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే.. రాజధాని నిర్మించడం సాధ్యమవుతుందా అని జగన్ ప్రశ్నించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అన్నారు. ఇలాంటి ప్రాంతాలు భవిష్యత్తు తరాలకు ఉద్యోగాలిచ్చే అభివృద్ధి ఎప్పటికి సాధ్యమవుతుందన్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లక తప్పదన్నారు.

ఇది చదవండి: అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల రద్దు బిల్లు.. మంత్రి బుగ్గన కీలక ప్రకటనరాష్ట్రంలో అన్ని సౌకర్యాలున్న విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. విశాఖలో సుందరీకరణ, రోడ్లు, ఇతర చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపడితే ఐదేళ్లలో హైదరాబాద్ తో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తించి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాకపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల త్యాగాన్ని, ఆకాంక్షలను గుర్తించి న్యాయరాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు.


ఇది చదవండి: ఇది ఇంటర్వెల్ మాత్రమే.. సినిమా ఇంకా ఉంది... పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..


ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత రకరకాలుగా వక్రీకరిస్తూ, అపోహలు సృష్టిస్తూ, న్యాయపరమైన చిక్కులు సృష్టించారన్నారు. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు రాజదానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈ పాటికే మంచి ఫలితాలు అందుబాటులోకి వచ్చి ఉండేవి. శ్రీభాగ్ ఒప్పందం స్ఫూర్తితో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. గతంలో కేంద్రీకరణ ధోరణిని ప్రజలు ఎలా వ్యతిరేకించారో 2019 ఎన్నికల్లో స్పష్టంగా వ్యక్తమైందన్నారు.

ఇది చదవండి: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై అనూహ్య పరిణామాలు... ఆమోదం నుంచి రద్దు వరకు ఏం జరిగిందంటే..!


హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దేవద్దని అలాంటి చారిత్రాత్మక తప్పుకు పాల్పడవద్దని ప్రజాతీర్పుతో స్పష్టమైందని జగన్ న్నారు. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాల వారి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది కాబట్టే ప్రభుత్వాన్ని ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు దీవిస్తూ వచ్చారన్నారు. వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలనే ప్రచారం చేశారని జగన్ అన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనబెట్టి.. కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను ముందుకు తోశారని సీఎం గుర్తు చేశారు.

ఇది చదవండి: కేసీఆర్ నుంచి వంశీ వరకు... చంద్రబాబు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మానరా..?


ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగుపచేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సవివరమైన బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని జగన్ ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap capital, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు