Home /News /politics /

ANDHRA PRADESH CM YS JAGAN MOHAN REDDY MADE INTERESTING COMMENTS ON DRUGS ISSUE AND CONDUCTED REVIEW MEETING FULL DETAILS HERE PRN

YS Jagan on Drugs: డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో డ్రగ్స్ వ్యవహారంపై (Drugs Issue) ఇటీవల ప్రభుత్వంపై (AP Government) విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తొలిసారి స్పందించారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో డ్రగ్స్ వ్యవహారంపై (Drugs Issue) ఇటీవల ప్రభుత్వంపై (AP Government) విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ పోర్టులో (Gujarath Port) పట్టుబడిన డ్రగ్స్ కు విజయవాడ (Vijayawada) డెలివరీ అడ్రస్ ఉండటంతో ఆ వ్యవహారం అధికార పార్టీ వైపు తిరిగింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పై జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) స్పందించారు. ఏపీకి సంబంధం లేని వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. లేని అంశాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేసి కొందరు వ్యక్తులను ఇందులోకి లాగుతున్నారన్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోందిన్న సీఎం.., పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయని.., ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

  కాలేజీలు-యూనివర్సిటీలపై దృష్టి
  కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్స్ రహితంగా ఉండేలా తక్షణ చర్యలకు సీఎం ఆదేశించారు. అన్నికాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలని.., మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా? లేవా? సమీక్షించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ ఘటనలు చోటు చేసుకుంటున్న కాలేజీలు ఉంటే గనుక అలాంటి కాలేజీలను మ్యాపింగ్‌ చేసి.. వారికి ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదని.., దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని.., ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించాలని చెప్పారు. అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్‌ ఫ్రీగా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు... సేమ్ టు సేమ్ పవన్ లాగానే..!


  ‘దిశ’ అమలుపై సమీక్ష
  రాష్ట్రంలో దిశ అమలుపైనా సీఎం జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని పోలీసులు సీఎంకు వెల్లడించారు. దిశ యాప్‌ద్వారా ఇప్పటివరకు 5,238 మందికి సహాయం అందిదని.. దిశయాప్‌ ద్వారా 2021లో 684 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు వివరించారు. దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చినట్లు పోలీసులు సీఎంకు తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  ఇది చదవండి: ఏపీలో స్కూళ్ల మూత తప్పదా... ఒకే బడిలో 72మంది విద్యార్థులకు పాజిటివ్...


  రాష్ట్రంలో ‘దిశ’ చట్టం చాలా సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలని... అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని స్పషఅటం చేశారు. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలిని.., ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

  ‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష
  ‘దిశ’బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో వివరాలను అధికారులకు సీఎంకు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదన్నారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.., ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్న అధికారులు..డిసెంబర్‌నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.

  ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP disha act, Drugs racket

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు