Home /News /politics /

ANDHRA PRADESH CM YS JAGAN JOINED KOO TO CONNECT WITH PEOPLE THROUGH SOCIAL MEDIA FULL DETAILS HERE PRN

YS Jagan: సోషల్ మీడియాలో సీఎం జగన్ జోరు.. కొత్త యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువ

AP cm jagan Photo : Twitter

AP cm jagan Photo : Twitter

ఇప్పటికే సీఎం జగన్ ట్విట్టర్ (YS Jagan Twitter) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలు, వివిధ అంశాలపై ట్వీట్స్ చేస్తూ ఉంటారు.

    సోషల్ మీడియా. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీని ద్వారానే ఒకరితో ఒకరు సంభాషిస్తున్నారు. పీఎం నుంచి రాష్ట్రాల సీఎంల వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేశారు. ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ Koo (కూ) లో చేరారు. సీఎం జగన్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (@YSRCPOfficial), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ (@AndhraPradeshCM) మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (@APDigitalCorp) కూడా Kooలో అకౌంట్లు క్రియేట్ చేశాయి. @ysjagan హ్యాండిల్‌ ద్వారా సీఎం జగన్ ప్రజలతో తెలుగు మరియు ఇంగ్లీష్ లో ప్రజలతో సంభాషిస్తారు. కూ యూజర్లు https://www.kooapp.com/profile/ysjagan లో కనెక్ట్ అవ్వచ్చు.

    Koo (కూ) వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ.. సీఎం జగన్ కు స్వాగతం పలుకుతూ మెసేజ్ పోస్ట్ చేశారు. “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని Koo (కూ) యాప్ కి స్వాగతిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు వారి ఫాలోవర్స్ అందరికీ అందుబాటులో ఉండేందుకు వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలను రోజూ సులభంగా వాళ్ళతో పంచుకునేందుకు Koo (కూ) యాప్ సహాయపడుతుంది” అని తెలిపారు.

    కూ లో చేరిన సీఎం జగన్


    ఇది చదవండి: ఎమ్మెల్యే రోజాకు రోజాపూలతో అభిషేకం... పూలవానలో తడిసి ముద్దైన జబర్దస్త్ జడ్జ్

    Koo (కూ) సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్క సీఎంను స్వాగతిస్తూ, "శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని Koo (కూ) లోకి స్వాగతిస్తున్నాము. Koo (కూ) యాప్ లో వారి ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వారందరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాను" అని తెలిపారు.

    ఇది చదవండి: మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్... హైకోర్టులో ఊరట


     ఇప్పటికే సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలు, వివిధ అంశాలపై ట్వీట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా కూ లో చేరడం ద్వారా మరింత మందికి సీఎం దగ్గరకానున్నారు. దేశీయంగా రూపొందించబడిన కూ యాప్ లో పలువురు తెలుగు ప్రముఖులు కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు. బీజేపీ మహిళా నేత విజయశాంతి, నటులు తనికెళ్ల భరణి, ఎల్‌బి శ్రీ రామ్, హీరోయిన్లు ఈషా రెబ్బా, అనుష్క శెట్టి, యువ హీరో నాగ శౌర్య గారు కూడా Koo (కూ)  ద్వారా ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు