• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • ANDHRA PRADESH CM JAGNA MOHAN REDDY REVIEW ON HOUSING COLONIES SCHEME NGS

Andhra Pradesh: శరవేగంగా జగనన్న కాలనీ పనులు.. ఇది నా కల.. మీ కల కావాలి అంటున్న సీఎం జగన్

పేదల ఇంటి కల నెరవేరుస్తానంటున్న సీఎం జగన్

ఏపీలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఇవ్వడాన్ని సంకల్పంగా తీసుకున్నాను అన్నారు సీఎం జగన్.. మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని కోరుతున్నారు. అప్పుడే తన కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 • Share this:
  పేదలకు ఇళ్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కలను త్వరగా పూర్తి చేసుకోవాలని గట్టిగా సంకల్పించారు. దీన్ని విజయవంతం చేయాలని తపనపడుతున్నారు. తన కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి అంటున్నారు సీఎం జగన్. తన కల మీ అందరి కల కావాలని పిలుపు ఇచ్చారు. మనందరి కలతో పేదవాడి కల సాకారం కావాలి అని అధికారులకు సూచించారు. అప్పుడే పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దిగ్విజయమవుతుంది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నదే మన లక్ష్యం కావాలని అధికారులకు స్పష్టం చేశారు.

  ఏపీలో రూరల్, అర్బన్‌ కలిపి 9,024 లే అవుట్లలోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా అన్ని లే అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వారం రోజుల్లో కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు సౌకర్యాల ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని చెప్పారు. వీటిపై మరింత ధ్యాస పెట్టలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా చార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  ఇదీ చదవండి: ఆ కీలక నేతను సీఎం జగన్ ఎందుకు దూరం పెడుతున్నారు..? వ్యహారం అక్కడే చెడిందా?

  దాదాపు 34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల అని అన్నారు. గతంలో రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ స్థాయిలో ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీఎం జగన్‌ చెప్పారు. ఇంత పెద్ద లక్ష్యం గురించి గతంలో ఎవరూ ఆలోచించలేదని, దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందన్నారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతకు పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించారు.

  ఇదీ చదవండి: ఏపీలో ఆ మంత్రి 100 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు.. ఆయన సమాధానం ఏంటంటే..

  మనసా, వాచా, కర్మణా.. ఈ పనుల పట్ల అధికారులు అంకిత భావాన్ని ప్రదర్శించాలని, అప్పుడే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతామని చెప్పారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాకుండా, మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలని కోరారు. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నంబరు కేటాయించాలని ఆదేశించారు. అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలని, ఇందులో భాగంగా ప్రతి లేఅవుట్‌లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీని ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
  Published by:Nagesh Paina
  First published: