హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం... ఇవాళ్టి నుంచి లబ్దిదారుల ఇంటికే ఆ డబ్బు...

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం... ఇవాళ్టి నుంచి లబ్దిదారుల ఇంటికే ఆ డబ్బు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Andhra Pradesh : రాజధాని తరలింపు అంశం కాస్త ఆలస్యం అయ్యేలా ఉండటంతో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి అంశాలపై దృష్టిసారిస్తోంది. ఇవాళ్టి నుంచి ఇంటికే పెన్షన్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Andhra Pradesh : దేశంలోనే నాలుగో బెస్ట్ సీఎంగా ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ సర్వే ద్వారా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇవాళ మరో కీలక పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అదే వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక. ఇది ఆల్రెడీ ప్రకటించినదే అయినా... ఇందులో కీలక మార్పులు చేయబోతున్నారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు వరకూ కేవలం రూ.1000 మాత్రమే ఉన్న పెన్షన్‌ను రూ.2,250 చేయడమే కాదు... ఆ డబ్బును నేరుగా ఇంటికే పంపనున్నారు. ఇలా ఇవాళ ఏపీలో 54.64 లక్షల మంది పెన్షన్ పొందబోతున్నారు. ఈ డబ్బును ఎవరో కాదు.... గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు స్వయంగా తెచ్చి... ఇంటి తలుపు తట్టి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు రూపాయి కూడా లంఛం ఇవ్వకూడదు. అలా ఇచ్చిన వారిని, తీసుకున్నవారినీ అరెస్టు చేస్తారు. అందువల్ల పెన్షన్ డబ్బు ఇవ్వగానే తీసుకోవాలి. అంతే తప్ప లంఛం ఇవ్వకూడదు. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అందువల్ల మధ్యాహ్నం 12 గంటలకల్లా... లబ్దిదారుల అందరి ఇళ్లకూ డబ్బు చేరాల్సి ఉంది. ఒకవేళ అలా జరగకపోతే... రేపటికల్లా ఇచ్చేలా కూడా ఏర్పాట్లున్నాయి.

అధికారంలోకి రాగానే సీఎం జగన్... పింఛన్‌ను రూ.1000 నుంచీ రూ.2000 చేశారు. ఏటా రూ.250 పెంచుతానని చెప్పారు. అలా నాలుగేళ్లలో రూ.3వేలు చేస్తానన్నారు. అదే ప్రకారం పెంచుతూ పోతున్నారు. ఇందుకోసం 2019-20లో రూ.15675 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ లబ్దిదారుల్లో ఎవరెవరు ఉంటారంటే... ముసలివాళ్లు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్య్సకారులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చర్మకారులు అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం ముసలివారి పింఛను అర్హత వయస్సును 60 ఏళ్లుగా నిర్ణయించారు. అందువల్ల 60 ఏళ్లు పూర్తిగా నిండిన వారు ఈ పెన్షన్ పొందగలరు. 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట ఉన్నవారిని కూడా ఈ పథకానికి లబ్దిదారులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

First published:

Tags: Ap cm jagan, AP News, AP Politics, Pension Scheme, Ys jagan

ఉత్తమ కథలు