Jagan Bail: ఈ నెల 15న జగన్ బెయిల్ రద్దుపై తీర్పు.. 16 సీఎం ప్లాన్ ఇదే.. ఏం జరగబోతోంది?

సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)

Jagan Bail: ఈ నెల 15వ తేదీన ఏం జరగనుంది..? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అవుతుందా..? బెయిల్ కొనసాగుతుందా..? విపక్షాల వాదన ఎలా ఉన్నా.. తన బెయిల్ రద్దు కాదని సీఎం జగన్ కు ముందే తెలిసిందా..? ఎలా..?

  • Share this:
    అన్నా రఘు, న్యూస్18 అమరావతి..

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Andhra Pradesh CM Jagan Mohan Reddy ) బెయిల్ రద్డు (Bail cancel) చేయాలంటూ ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuram Krishna Raju) వేసిన పిటీషన్ పై విచారణ ఇప్పటికే  పూర్తైంది. ఈ కేసులో ఇరు వర్గాల వాదన పూర్తైంది. దీంతో తుది తీర్పు వెలువడుతుందని అంతా ఆశిస్తున్నారు. ఈ నెల15వ తేదీ  ఆర్డర్ ఇస్తామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.. అయితే జగన్ బెయిల్ రద్దు కేసు తీర్పుదశలో ఇప్పటికే అనేకపర్యాయాలు వాయిదా పడుతూ వచ్చింది. జగన్ తో పాటు ఆ పార్టీ మరో ఎంపీ విజయసాయిరెడ్ది (MP Vijayasaireddy) కూడా అనేక కేసులలో సహ నిందితుడిగా ఉండటంతో అతని బెయిల్ కూడా రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి ల బెయిల్ రద్దు పిటిషన్ లపై నిర్ణయం ఈ నెల 15న వెలువరిస్తామంటూ... కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్‌లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్‌గా ఇస్తామని సీబీఐ కోర్ట్ స్పష్టం చేసింది.ః

    ఈ ఇద్దరి బెయిల్ రద్దు అవుతుందా.. కొనసాగుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రతిపక్షాలు ఒకింత గట్టినమ్మకంతో ఉన్నాయి. పిటిషనర్ ఎంపీ రఘురామ రాజు అయితే చాలా నమ్మకంతో జగన్ బెయిన్ రద్దు అవుతుందని పదే పదే చెబుతున్నారు.. ఇటు వైసీపీ వర్గాలు కూడా బయలకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. లోలోన మదనపడుతున్నాయి.

    ఇదీ చదవండి: ఈ వినాయకుడి చెవిలో చెబితే మీ కోర్కెలు నెరవేరుతాయి.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా..?

    తాజా పరిస్థితి చూస్తే బెయిల్ రద్దు కాదని.. కొనసాగుతుందని సీఎం జగన్ ముందే తెలుసు అనే ప్రచారం మొదలైంది. బెయిల్ కొనసాగుతుందనే విశ్వాసమో.. లేక ముందస్తు సమాచారం ఉందో తెలియదు కాని.. అందుకే ఈ నెల 16 కేబినెట్ భేటీ సమావేశం ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

    ఇదీ చదవండి: ఛీ ఛీ వీడిని తండ్రి అంటారా..? ఐదేళ్ల కన్నకూతురిపైనే దారుణం.. ఇలాంటి వాడిని ఏం అనాలి..?

    సీఎం జగన్ కు బెయిల్ రద్దవుతుందని ముందే తెలుసు కాబట్టి ధీమాగా 16వ తేదీని కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని.. ఒకవేళ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని అనుమానం ఉంటే ఎందుకు కేబినెట్ భేటీకి 16న ముహూర్తం ఖరారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

    ఇదీ చదవండి:సీఎం కార్యాలయం నుండి అంటూ ఫోన్..! అంగన్వాడీ కార్యకర్తలను వదలని సైబర్ నేరగాళ్లు

    ఒకవేళ సీఎం బెయిల్ రద్దైతే.. కేబినెట్ సమావేశం ఎలాగూ రద్దవుతుంది, అదే జగన్ పై బెయిల్ రద్దు పిటీషన్ ను కోర్టు రద్దు చేస్తే జగన్ కు  అతి పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది. దానికి తోడు ఎంపీ రఘురామకు పెద్ షాక్ అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి.. జగన్ సర్కార్ కు మరో షాక్

    ముఖ్యంగా తన బెయిల్ రద్దు విషయంలో కేంద్ర పెద్దల నుంచి హామీ వచ్చిందనే ప్రచారం ఉంది.  అందుకే జగన్ అంత ధీమాగా కేబినెట్ భేటీ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published: