Home /News /politics /

ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY WILL GO TO DAY ODISHA EVENING WILL DISCUSES WITH CM NAVIN PATNAIK NGS VZM

AP CM Jagan: కొఠియా గ్రామాలు.. జల వివాదాలపై ఫోకస్.. నేడు ఒడిషా సీఎంతో జగన్ భేటీ

నేడు ఒడిషాకు సీఎం జగన్

నేడు ఒడిషాకు సీఎం జగన్

CM Jagan Odisha schedule: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇవాళ ఒడిషా వెళ్లనున్నారు. అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ తో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు రానున్నాయి..? ముఖ్యంగా కొఠియా గ్రామాల సమస్య కు పరిష్కారం లభిస్తుందా అనేది ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
  CM Jagan Odisha Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఒడిషా (Odisha) పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తో భేటీ కానున్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్ (Bhuvaneswar)లోని నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు గంటల పాటు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బార్డర్ విషయాలను కూడా చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు, నీటి వివాదాల (Water disputes)పరిష్కారం దిశగా కసరత్తు జరుగుతొంది. తరువాత ఏడు గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణ అవుతారు సీఎం జగన్ (CM Jagan). ఇక రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.

  పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను ఆశిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్‌ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఇవాళ సాయంత్రం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు.

  ఇదీ చదవండి: విద్యార్థులపై విరిగిన లాఠీ.. పగిలిన తల.. అణచివేయాలని చూస్తే నేలకొరగడం ఖాయం అంటు లోకేష్ ఫైర్

  ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలిసింది.

  ఇదీ చదవండి: ఏపీ సంస్కరణలు దేశానికే ఆదర్శం.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేదీలేదని మంత్రి వార్నింగ్

  ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
  ముఖ్యంగా కొఠియా గ్రామాల్లో సమస్యపై పరిష్కారంపై ఫోకస్ చేయనున్నారు. ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్‌కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

  ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వంపై జనసేన మరో పోరాటం.. ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ భరోస

  నేడు  శ్రీకాకుళానికి సీఎం జగన్                                                                             మొదట సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు పాతపట్నం చేరుకుని పెళ్లి రిసెప్షన్‌కు హాజరవుతారు. తరువాత విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సీఎం జగన్‌ వెంట ఒడిశా పర్యటనలో పాల్గొంటారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Odisha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు