హోమ్ /వార్తలు /National రాజకీయం /

CM Jagan: ఇక జనంలోకి జగన్.. త్వరలో జిల్లా స్థాయి పర్యటనలు.. కారణం ఇదే

CM Jagan: ఇక జనంలోకి జగన్.. త్వరలో జిల్లా స్థాయి పర్యటనలు.. కారణం ఇదే

ఇక జనంలోకి జగన్

ఇక జనంలోకి జగన్

CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ జగన్ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటో తెలుసా..?

CM Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. కరోనా పరిస్థితుల కారణంగా ఆయన చాలా నెలలుగా ప్రజలకు దూరంగా ఉన్నారు. సమావేశాలు, ప్రారంభోత్సవాలు అన్ని వర్చువల్ ద్వారా పూర్తి చేశారు. సాధారణంగా సీఎం జగన్ ను జన నేత అని వైసీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఎలాంటి సమయంలోనైనా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జనంలోకి వెళ్లింది ఎప్పుడంటే వేళ్లపైనే లెక్క బెట్టొచ్చు. అయితే ఇప్పటికే సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి అంటే ఈ మూడేళ్లు ప్రతి రాజకీయ పార్టీకి చాలా ముఖ్యం. అందులోనూ అధికార పార్టీ తిరిగి అధికారం చేపట్టాలి అంటే జనంలో ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోవాలి. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నా.. కొన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పథాకాలు అందిరికీ అందడం లేదని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు గతంలో పాదయాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండే ఆయన.. అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు పూర్తిగా దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్సించుకున్నట్టు సమాచారం. దాని ఆధారంగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇక జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సిద్ధమైనట్టు వైసీపీ వర్గాల టాక్.

త్వరలో తాను జిల్లా స్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్టు అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందనపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టగానే ఎమ్మెల్యేలు, అధికారులతో మండల స్థాయి పర్యటనలు చేస్తానని చెప్పినట్టు సమాచారం. ప్రతిరోజు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని సందర్శిస్తానని జగన్ వారికి చెప్పారు. కనీసం వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని వెల్లడించినట్టు తెలుస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ప్రతి రోజు మండలస్థాయిలో సచివాలయాలను సందర్శించే కార్యక్రమం మొదలవుతుందన్నారు.

ఇదీ చదవండి: బాలయ్యను టెన్షన్ పెడుతున్న ఇద్దరు అల్లుళ్లు.. దాని కోసం ఇద్దరూ పోటీ..?

మరోవైపు స్పందన కార్యక్రమంలో కోవిడ్ నివారణపై సీఎం జగన్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే 10 సార్లు ఫీవర్ సర్వే చేశామని చెప్పారు. ఫీవర్ సర్వే నిరంతరాయంగా జరగాలన్నారు. లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసి వైద్య సేవలందించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ఆదేశించారు. దేవుడి దయ వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ అలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

ఇదీ చదవండి: హరిబాబుకు గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణం ఇదే..? సీఎం జగన్ స్వాగతిస్తారా..?

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనల్లో ఉండాలని సూచించినట్టు సమాచారం. ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు జరగాలని చెప్పారు. రెండో శుక్రవారం మండలాల వారీగా, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో వ్యవసాయ మండలి సమావేశాలు నిర్వహించాలన్నారు. జులై 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ysrcp

ఉత్తమ కథలు