CM Jagan Review Meeting On Roads: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కొన్ని రోడ్లపై ప్రయాణం చేయాలి అంటే నరకం కనిపిస్తోంది. దాదాపు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ప్రధాన రహదరులు కూడా గుంతల మయంగా మారాయి. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న భారీగా వర్షాలు (Heavry Rains) కురవడంతో రోడ్లు మరింత డామేజ్ అయ్యాయి.. రహదారులే చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు పోయిన తరువాత బురద, మట్టి పేరుకుపోయి గుంతల మయం అవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. విపక్షాలే కాదు.. సామాన్య ప్రజలు సైతం ఏపీలో రోడ్ల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. రహదారుల మరమ్మత్తులు చేపట్టడంపై స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Rddy) ఫోకస్ చేశారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న గుంతలు అన్నింటినీ అతి త్వరగా పూడ్చి వేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను గుర్తించి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలి అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ.. విమర్శలు రాకుండా 2022 జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ పెట్టారు సీఎం జగన్.
ఇదీ చదవండి: టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే
వచ్చే నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడకు వస్తున్నారని.. ఆయన వచ్చే నాటికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరించాలని సూచించారు. కేంద్రమంత్రికి పెండింగ్ ప్రాజెక్ట్‌ల వివరాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ఇదీ చదవండి: కుప్పంలో యుద్ధ వాతావరణం.. విశాఖలో పోటాపోటీ దాడులు.. ఫిర్యాదులతో ముగిసిన పోలింగ్
గత అనుభవాలను గుర్తించి పని చేయాలన్నారు. ముందుగా గుంతలు పూడ్చి, ఆ తర్వాత కార్పెటింగ్ చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రోడ్ల మీద అన్ని చోట్లా గుంతలు పూడ్చాల్సేందే అని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ప్రత్యేకించి కొన్ని రోడ్లు అని కాకుండా రాష్ట్రం మొత్తం చేయాలని.. ఎక్కడా ఒక చిన్న గుంత కూడా కనిపించకూడదన్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా రోడ్ల మరమ్మతుల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: శ్రీరాముడి కంట నీరు.. భయంతో క్యూ కట్టిన భక్తులు.. ఏదో జరగబోతోంది అంటూ ఆందోళన
ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు వెంటనే మొదలు పెడతామని అధికారుల వెల్లడించారు. 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం చెప్పారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్ వరకు అన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని స్పష్టంగా చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics