Village Sarpanch Wrote a letter to CM Jagan: గ్రామాల్లో సమస్యలు ఉంటే ఆ గ్రామ సర్పంచ్ (Village Sarpanch) దే బాధ్యత.. అయితే నిధులతో పని కాబట్టి అధికారులను ఆశ్రయించాల్సిందే.. అప్పటికీ పనులు అవ్వకపోతే జిల్లా అధికారులకు విన్నపాలు పెట్టుకుంటారు.. అయినా అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తారు. అధికార పార్టీ నేతలు (Local YSRCP Leaders) అయితే అదిరించో బెదిరించో.. బతిమాలో ఏదో ఒకలా తమ పనులను చేయించుకుంటున్నారు. కాస్త చిత్త శుద్ధి ఉన్న సర్పంచ్ లు అయితే గ్రామ సమస్యను తమ సొంత ఎజెండాగా తీసుకుని అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు వరుస విన్నపాలు చేసుకుంటారు. నిధులు విడుదల చేయించుకుంటారు. కానీ ఓ మహిళా సర్పంచ్ (Women Sarpanch) చేసిన పని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన పనితో జిల్లాస్థాయి ఉన్నత అధికారులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఆఘమేఘాలపై ఆ ఊరి సమస్యను తీర్చేందుకు అధికారులు ముందుకు వచ్చారు. ఇంతకీ ఆ మహిళా సర్పంచ్ ఏం చేసిందంటే..
తమ గ్రామానికి చెందిన రోడ్లు గుంతలతో (Damaged Raods) నిండి ఉన్నాయని.. రహదారిపై ప్రయాణించే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. తరచుగా యాక్సిడెంట్స్ (Accidents) అవుతున్నాయని.. తక్షణమే రోడ్లు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని ఓ గ్రామ సర్పంచ్ వినతికి నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) స్పందించారు. దీంతో అధికారులు హుటాహుటిన రహదారి మరమ్మత్తులను చేపట్టక తప్పలేదు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా (East Godavari district) పి.గన్నవరం (P Gannavaram) లో చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: హిస్టరీ పై ప్రేమతో ఓ తండ్రి ఏం చేశాడంటే.. అతడి బిడ్డలకు ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు..
పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు వేయాలని బెల్లంపూడి సర్పంచ్ బండి మహాలక్ష్మి చాలాసార్లు అధికారులను కోరారు. ఈ మార్గంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ పదే పదే చెప్పినా ఆ రోడ్లకు మరమ్మత్తులకు ముందడుగు పడలేదు. దీంతో సర్పంచ్ మహాలక్ష్మి నేరుగా ధైర్యం చేసి సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ ఉత్తరం సీఎం దృష్టికి చేరుకుంది. వెంటనే సీఎం ఓ కార్యాలయం ఈ ఉత్తరపై స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను రిలీజ్ చేసింది. దీంతో పి.గన్నవరం నుండి గంటి పెద పూడి వరకు వెళ్లే రహదారి మరమ్మతులను అధికారులు చేపట్టారు. అంతేకాదు త్వరలోనే టెండర్లు వేసి రోడ్లు నిర్మిస్తామని సర్పంచ్ మహాలక్ష్మికి అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, East Godavari Dist