AP CM Jagan Trending: ట్విట్టర్ లో జగన్ ట్రెండింగ్... చరిత్ర సృష్టించిన ఏపీ సీఎం.

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీ సీఎం జగన్ కు రాష్ట్రాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఏపీలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ జగన్ కు ఫాలోయింగ్ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కట్టడి చర్యల విషయంలో వివిధ సర్వేల్లో జగన్ మంచి ర్యాంక్ దక్కుతోంది. అందుకే ఆయన మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు.

 • Share this:
  ట్విట్టర్ లో సీఎం జగన్ పేరు మారుమోగుతోంది. దాదాపు అన్ని సోషల్ మీడియాలో జై జగన్ అనే కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151  ఎమ్మెల్యేలను గెలిపించుకుని  చరిత్ర సృష్టించిన జగన్.. పాలనకు సరిగ్గే నేటికి రెండేళ్లు పూర్తైంది. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ రెండేళ్ల పాలన సంబరాలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ‘2ఇయర్స్‌ ఫర్‌ వైఎస్‌ జగన్‌ అనే నేను’హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఈ హ్యాష్ ట్యాగ్ నిలిచింది. ఈ ట్రెండింగ్‌ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో క్రియేట్‌ చేసిన రెండున్నర గంటల్లోనే లక్ష మందికిపైగా ట్వీట్లు చేయడం విశేషం.

  ఏపీ సీఎం జగన్ కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ను తెలియజేస్తోంది. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా సృష్టించిన హ్యాష్‌ట్యాగ్‌ కూడా భారీగా ట్రెండింగ్‌లో నిలిచింది. గతేడాది సీఎంగా మొదటి ఏడాది పూర్తి చేసుకున్నప్పుడు రూపొందించిన హ్యాష్‌ట్యాగ్‌ను 20 లక్షలకు మందికిపైగా ట్రెండింగ్‌ చేశారు. ఇప్పుడు ఆ రికార్డులు చెరిపెట్టుకుపోతున్నాయి..

  సమస్యలు, విపక్షాల ఆరోపణలు ఏవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా.. చెక్కు చెదరని ఆత్మ‌స్థైర్యంతో సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనను సాగించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి, ఆ దిశలోనే, ఆ లక్ష్య సాధనే శ్వాసగా పనిచేసుకుపోతున్నారు. అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి.. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.

  పెన్షన్‌ నుంచి పథకమైనా ఇంటి గడపలోకే వచ్చేలా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు. జగన్ సర్కారు రెండేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు.

  ముఖ్యంగా అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ.. వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాల గురించి ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది..

  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. అంటూ రెండేళ్ల కిందట ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఆ సందర్భంగా ‘వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌. మేనిఫెస్టోలో ఏమి చెప్పామో, వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తామంటూ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం నవరత్నాల పేరుతో సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాల సంఖ్య రోజు రోజుకూ పెంచుతూనే ఉన్నారు. ఈ రెండేళ్లలో నవరత్నాల ద్వారా 6.5 కోట్ల మందికి ( కొందరు ఒకటి కంటే ఎక్కువ పథకాలతో లబ్ధి పొందుతున్నారు) వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.95,528.50 కోట్లు నేరుగా బదిలీ చేశారు. నగదేతర పథకాల ద్వారా మరో 2.36 కోట్ల మందికి రూ.36,197.05 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పించారు.

  ముఖ్యంగా కరోనా విపత్తులో ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం జగన్‌ నోట ఏనాడూ కూడా పథకాల అమలుకు డబ్బుల్లేవు.. అనే మాట రాలేదు. కరోనా విపత్తుతో లాక్‌ డౌన్‌, కర్ఫ్యూల నేపథ్యంలో ఆదాయ వనరులు తగ్గిపోయినప్పటికీ నవరత్నాలను అమలు చేస్తూనే ఉన్నారు. పథకాలను ఎప్పుడు ఆపలేదు. వరుసగా మూడో ఏడాదిలో ఏ పథకం ఏ నెలలో అమలు చేసేది ముందుగానే సంక్షేమ క్యాలండర్‌ను ప్రకటించారు. అలాగే రాష్ట్ర జనాభాలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా 95 శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. కోవిడ్‌–19, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలను వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీలోకి చేర్చడం ద్వారా లక్షకు పైగా పేద, సామాన్యులకు కోవిడ్‌ చికిత్సను ఉచితంగా అందించారు.
  Published by:Nagesh Paina
  First published: