Home /News /politics /

YS Jagan: గ్రామాలే కాదు.. నగరాలు వైసీపీ వెంటే.. విజయానికి అదే కారణమంటూ సీఎం జగన్ ట్వీట్

YS Jagan: గ్రామాలే కాదు.. నగరాలు వైసీపీ వెంటే.. విజయానికి అదే కారణమంటూ సీఎం జగన్ ట్వీట్

మున్సిపల్ ఎన్నికలపై సీఎం జగన్

మున్సిపల్ ఎన్నికలపై సీఎం జగన్

YS Jagan on Municipal Result: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎన్నికలు నిర్వహించడం కన్నా ఏకపక్షం చేసుకోవడం మేలు అనేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్నిక ఏదేనా.. ప్రాంతం ఎక్కడైనా.. అధికార పార్టీ పోటీలో ఉంది అంటే వార్ వన్ సైడ్ అవుతోంది. గ్రామాలే కాదు పట్టణాలు కూడా వైసీపీకే పట్టం కడుతున్నాయి. ఈ ఫలితాలకు కారణం ఇదే అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  CM Jagan On Municipal Elections Result: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ దూకుడుకు బ్రేకులు ఉండడం లేదు.. ఫ్యాన్ గాలీ స్పీడు ముందు ప్రత్యర్థి పార్టీలు పరార్ అవుతున్నాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి.2019లో మొదలైన వైసీపీ (YCP) ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ విజయం రెట్టింపు అవుతూనే ఉంది. ఉప ఎన్నికైనా.. స్థానిక సంస్థల ఎన్నికలైనా.. వైసీపీ బరిలో ఉంటే వార్ వన్ సైడ్ అయిపోతోంది. తాజాగా నెల్లూరు (Nellore) కార్పొరేషన్‌ కు.. కుప్పం  సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ ప్రకటించారు. కేవలం రెండు మున్సిపాలిటీలు మినహా అన్నింటి వైసీపీ వన్ సైడ్ విక్టరీ సాధించింది. ముఖ్యంగా ఎంతో ఉత్కంఠ రేపిన కుప్పం మున్సిపాలిటీ (Kuppam Municipality) ని కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం. అందులోనూ ఆయన కంచుకోటగా గుర్తింపు పొందిన కుప్పం ఫలితం కూడా వన్ సైడే అయ్యింది. 25 వార్డులకు గాను వైసీపీ 19 వార్డుల్లో విజయం సాధించింది. ఈ ఫలితాలు చెప్పొచ్చు వైసీపీ జోరుకు ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి.

  నెల్లూరు కార్పొరేషన్ ఫలితాల్లో విపక్షాలు అడ్రస్ కూడా గల్లంతైంది. మొత్తం కార్పొరేషన్ లో 54 స్థానాలు ఉంటే.. అందులో 8 ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల కూడా వైసీపీదే విజయం అయ్యింది. మొత్తం కార్పొరేషన్ ను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ సరికొత్త చరిత్ర తిరగ రాసింది. తాజా విజయాలతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉత్సాహం మరింతం పెరిగింది. రాష్ట్రా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ ఫలితాలపై సీఎం జగన్ సైతం స్పందిస్తూ ట్వీట్ చేశారు..

  ఇదీ చదవండి: కుప్పం మున్సిపాలిటీ ఫైనల్ ఫలితం ఇదే.. ఏ పార్టీ ఎన్నివార్డులు గెలిచాయి.. టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

  దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి అన్నారు సీఎం జగన్. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వచ్చాయి అన్నారు. వైసీపిని ఇంతలా ఆదరిస్తున్న అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు.

  దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.

  తాజా ఎన్నికలతో టీడీపీ అంతర్థానం అవుతోందన్నది స్పష్టమైంది అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇక పూర్తిగా విశాంత్రి తీసుకోవచ్చన్నారు. మంచి చేయకపోతే పూర్తిగా ఓడిపోతామని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ప్రజాప్రయోజాలపై చంద్రబాబు దృష్టి పెట్టాలని అన్నారు. న్యాయవ్యవస్థను కించపరిచిన లోకేష్‌పై కేసుపెట్టాలని అ‍న్నారు. తండ్రిని ముంచిన తనయుడని లోకేష్‌ పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు.

  ఇదీ చదవండి : కుప్పంలో చంద్రబాబుకు ఇక కష్టమే.. ప్రతి ఏడాది తగ్గుతున్నగ్రాఫ్.. కారణం అదేనా?

  ప్రజల తీర్పును వినయంగా, విధేయంగా స్వీకరిస్తున్నామని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలు ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ తీర్పును ఇచ్చారని అన్నారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా తమ నాయకుడు సీఎం జగన్‌ పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎవరైతే 2019లో తమకు ఓట్లు వేయలేదో వాళ్లు కూడా తమ పరిపాలన చూసి ఇప్పుడు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు అవంతి.

  ఇదీ చదవండి : ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్‌ బిశ్వబూషన్‌ హరిచందన్ కు పాజిటివ్

  ఇక మంత్రి అనిల్ సైతం తనదైన స్టైల్లో పంచ్ లు వేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని 54 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి అనిల్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. అభ్యర్థులతో టీడీపీ సరిగ్గా నామినేషన్‌ వేయించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఏజెంట్లను కూడా నిలుపుకోలేని పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. తమను రాజీనామా చేసి రమ్మన అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో ఏం చేశారని నిలదీశారు. టీడీపీకి దమ్ముంటే మిగిలిన 19 మంది రాజీనామా చేసి గెలవాలని, ఉప ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు అనిల్..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Avanthi srinivas, Cm jagan, Vijayasai reddy, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు