Andhra Pradesh CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) సొంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక (Badvel By poll)లో వార్ వన్ సైడ్ అయ్యింది. ఫ్యాన్ గాలి ముందు కమలం వాడింది.. చేయి విరిగింది. మెజార్టీ భారీగా తగ్గిస్తామని జాతీయ పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పదే పేద చెప్పాయి.. కానీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఫలితాలు మాత్రం రివర్స్ లో వచ్చాయి.. వైసీపీ (YCP) పెద్దలు కూడా ఊహించని మెజార్టీ సొంతం చేసుకున్నారు. బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ (Dasari Sudha).. ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,533 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన డాక్టర్ దాసరి సుధ ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 1,12,211, బీజేపీకి 21,678, కాంగ్రెస్‌కు 6,235, నోటాకు 3,650 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికే సుధ విజయం ఖరారైపోయింది. తరువాత రౌండ్లలోనూ ఎక్కడా ప్రత్యర్థులు పోటీలో నిలబడలేకపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ (TDP) అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డి (Satish Kumar Reddy)పై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ రికార్డ్‌ను బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.
ఈ విజయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతీ ఆత్మీయ సోదరునికి పేరుపేరునా జగన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. శాసన సభలో అడుగు పెట్టనున్న డా. సుధమ్మకు ముఖ్యమంత్రి అభినందనలు చెప్పారు. http://
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు. అంతేకాదు ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. ఈ విజయం అందించిన స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలకు మరింత మంచి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి. http://
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021
ఇటు సోషల్ మీడియాలో బద్వేల్ ఉప ఎన్నికపై ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేనలను టార్గెట్ చేస్తూ వైసీపీ అభిమానులు చేస్తున్న కొన్ని ట్వీట్లు డ్రెండింగ్ అవతున్నాయి.. http://
Happy Diwali Celebration Wishes from #BadvelByPoll #YSRCPWinsBadvel pic.twitter.com/i3OX762m47
— Rise Of YS Jagan (@RiseofYSJagan) November 2, 2021
ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. బద్వేల్ ఎన్నికతో ఏపీలో జాతీయ పార్టీలు పుంజుకోవడం.. కష్టమే అనే క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. బీజేపీ ఒంటరిగానే పోరాటం చేసినట్టు చెప్పినా.. టీడీపీ, జనసేన ఓట్లు కొంత వరకు బీజేపీకి సపోర్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. ఆ రెండు పార్టీల ఓట్లు పడినా.. బీజేపీకి డిపాజిట్ దక్కలేదు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Kadapa