Byreddy Siddharth: సొంత పార్టీ ఎమ్మెల్యేకు చెక్.. బైరెడ్డికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్..

బైరెడ్డి కి కీలక పదవి

వైసీపీ యూత్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ నాథ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. దీంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కు చెక్ పెట్టినట్టే అంటున్నారు బైరెడ్డి అభిమానులు.. మరి దీనికి ఎమ్మెల్యే వర్గీయులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి..

  • Share this:
    రాయలసీమలో మాస్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు.. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. ఇక వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా ఏంటో చూపిస్తామని.. మరోసారి జగన్ కు సీఎంగా చేసేంత వరకు పోరాడతాం అంటున్నారు ఆయన అభిమానులు.. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను జగన్ సర్కార్ నియమించారు. దీంతో బైరెడ్డి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. పదవి ప్రకటించినప్పటి నుంచి మాస్ సంబరాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్న అభిమానులు సందడి చేస్తూనే ఉన్నారు. జై బైరెడ్డన్న అంటూ నినాదాలతో మారుమోగిస్తున్నారు...

    2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వట్లేదని బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవను కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సర్ది చెప్పారని కూడా ప్రచారం ఉంది.

    ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా.. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయనకు పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి ఇంటి దగ్గర.. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అనుచరులు స్వీట్లు



    పంచుకుని.. పటాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు బైరెడ్డికి పదవి ఇవ్వడమే.. ఇంతకాలం ఆయన్ను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్ కు చెక్ పెట్టినట్టే అంటున్నారు బైరెడ్డీ వర్గీయులు.. దీనిపై ఎమ్మెల్యే వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి..
    Published by:Nagesh Paina
    First published: