YV Subba Reddy: బాబాయ్ ఒకటి తలిస్తే.. అబ్బాయి ఇంకోటి చేశారు.. ఈ మధ్య ఏం జరిగింది..?

ప్రతీకాత్మకచిత్రం

బాబాయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనుకుంటున్నారు.. అబ్బాయి మాత్రం మరో ఆలోచన చేశారు. మొన్నటి వరకు వేరే ప్రచారం జరిగింది. బాబాయ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకుంటారని అనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన్ను మరోసారి టీటీడీ చైర్మన్ పదవికి పరిమితం చేశారు. ఇంతకీ బాబాయ్ కోరికను కాదని.. జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 • Share this:
  నామినేటెడ్ పదవుల వ్యవహారం ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి కొత్త వాదనను తీసుకోచ్చారు సీఎం జగన్. ఏపీలో జోడు పదవుల వ్యవహారానికి బ్రేకులు వేశారు. దీంతో కీలక ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. రోజా, మల్లాది విష్ణు, జక్కం పూడి ముగ్గుర్ని చైర్మన్ పదవులను తప్పించారు. అయితే వారికి త్వరలోనే మంత్రి పదవులు ఇస్తారని.. అందుకే రెండో పదవి నుంచి తప్పించారనే ప్రచారం కూడా ఉంది. ఆ ప్రచారం ఎలా ఉన్నా సొంత బాబాయ్ విషయంలో జగన్ చర్యలు మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. నిజంగా జగన్ కు ఆ ఉద్దేశం ముందే ఉంటే.. పదవీ కాలం అయిపోయిన వెంటనే రెన్యువల్ చేసే వారు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లే ఉన్న కారణంగా టీటీడీ చైర్మన్ గా కొనసాగడం కంటే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటేనే బెటర్ అని వైవీ భావిస్తున్నారు. బాబాయ్ అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటే.. అబ్బాయి మాత్రం రెండోసారి నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టేయడం ఏంటనే చర్చ మొదలైంది..

  ఇటీవల బహిరంగంగానే వైవీ సుబ్బారెడ్డి తన మనసులో మాట బయట పెట్టారు. ఇంతకాల రాజకీయాల్లో ఉండి తనను నమ్ముకున్నోళ్లకి ఏమీ చేయలేకపోయానని.. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విషయం సీఎం జగన్‌‌కు వివరించానని కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. దీంతో ఆయన వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇవన్నింటికి చెక్ పెడుతూ.. తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండడం హాట్ టాపిక్ అయ్యింది.

  మొదటి నుంచి ఆయన ఒకటి అనుకుంటే.. అబ్బాయి వేరేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి వదులుకోవడం ఇష్టం లేకపోయినా.. అబ్బాయి జగన్ కోరికపై తప్పక కష్టంగానే వదులుకున్నారు. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్‌సభ సీటును త్యాగం చేయకతప్పలేదు. ఎంపీ సీటు రాకపోయిన అధికారంలలోకి వచ్చాక రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకుంటారని బాబాయ్ ఆశించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఆయన్ను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆ పదవీ కాలం ముగియడంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ కొనసాగింది. నిజానికి వైవీ సుబ్బారెడ్డి కోరుకుని ఉంటే టీటీడీ ఛైర్మన్ పదవి ఆయనకు రెన్యువల్ అయిపోయేంది.

  ఇదీ చదవండి: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు షాక్.. మరి మంత్రి పదవి..?

  కానీ ఆ పదవిలో కొనసాగడం కంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉండటానికే వైవీ ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుతం ఎంపీలు సరైన లాబీయింగ్ చేయడం లేదని.. అందుకే అమిత్ షా.. మోదీ లాంటి వారి అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్ వెయిట్ చేయాల్సి వస్తోందని.. అదే అత్యంత నమ్మకస్తుడైన బాబాయ్ ను ఢిల్లీ రాజకీయాలకు పంపిస్తే పార్టీకి కూడా ప్లస్ అవుతుంది.. అటు కేంద్ర పెద్దలతోనూ సాన్నిహిత్యం పెరుగుతుందని జగన్ భావిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. లేదా ఇప్పటికే ఎన్నికల టీంను రెడీ చేసుకోవడంలో వ్యూహాలు ను సిద్ధం చేస్తున్న జగన్.. బాబాయ్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా వైవీ అనుచరులు భావించారు. కానీ అనూహ్యంగా మరోమారు టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించడం హాట్ టాపిక్‌గా మారింది. చైర్మన్‌గా మరో రెండున్నరేళ్లు ఆయనే కొనసాగనున్నారు.

  ఇదీ చదవండి: టీటీడీ ఛైర్మన్ గా వై.వి.సుబ్బారెడ్డికి రెండో ఛాన్స్.. ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన సీఎం

  ఇకవేళ ముందే జగన్ దీనిపై నిర్ణయం తీసుకుంటే పదవి ముగిసిన వెంటనే ఎందుకుచెప్పలేదు.. ఈ మధ్యనే ఏదో జరిగిందని వైవీ వర్గీయులు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక రాజకీయ పరిస్థితులే ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా.. రాజ్యసభ కు పంపినా..  జిల్లాలో యాక్టివ్ అయినట్టే.. అదే జరిగితే ప్రత్యర్థి వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చెప్పలేని పరిస్థితి. అదే జిల్లాలో సీఎం మరో బంధువు రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని జగన్ భావించి ఉంటారని.. అందుకే మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది..
  Published by:Nagesh Paina
  First published: