AP CM Jagan: ఏపీ సీఎం జగన్ ప్రధాని అవుతారా..! అదే కారణం అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..

ఒక రోజు ప్రధాని కానున్న సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ త్వరలోనే ప్రధాని కాబోతున్నారా..? ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయనకు మాత్రమే అ అర్హతలు ఉన్నాయా...ఇంతకీ ఏంటి ఆయనకు ఉన్న అనుమతులు.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలే..

  • Share this:
    ఏపీ సీఎం జగన్ మరో 30 ఎళ్లు ముఖ్యమంత్రిగానే ఉంటారని వైసీపీ నేతలు పదే పదే చెబుతుంటారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా నిలబెడతాయని మంత్రులు సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జోస్యం చెప్పారు.. సీఎం జగన్ సేవలు కేవలం రాష్ట్రానికి పరిమితం కావని.. ఆయన ఒక రోజు ప్రధాని కూడా అవుతారు అంటున్నారు.. ఎప్పుడు అన్నది చెప్పకపోయినా.. కచ్చితంగా సీఎం జగన్ కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని.. ఏదో ఒకరోజు ప్రధాని అవ్వడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఉన్న పలు రాష్ట్రాల సీఎంల్లో మరెవరికీ అన్ని అర్హతలు లేవంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే చెప్పిన లెక్క ఏంటో తెలుసా..?

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పొగడ్తల్లో ముంచెత్తారు. సీఎం జగన్‌ నేతృత్వంలో జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడమే కాదు.. సుమారు 30 ఏళ్ల వరకు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని.. మరింత కృషి చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ పథకాలను కాపీ కొడుతున్నాయన్నారు.

    ఇక నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మరో అడుగు ముందుకు వేశారు. జగన్‌ ప్రధాన మంత్రి స్థాయికి ఎదుగుతారని, ఏదో ఒక రోజు ఆయన ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రస్తుతం దేశంలో నాలుగు భాషలు మాట్లాడే ఏకైక సీఎం జగన్ మాత్రమే అని.. అందుకే ఆయన ప్రధాని అవుతారని.. అలాగే ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి.. దేశ వ్యాప్తంగా ప్రజలు.. తమకు కూడా జగన్ లాంటి నేత సేవలు కావాలని కోరుకుంటున్నారన్నారు,.

    అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ మాట్లాడుతూ.. ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులు అడ్డుకుని కేసులు రాస్తున్నారని, దీనిపై పోలీసులకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. విజయవాడ నగరానికి చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలోని మండలాల్లో ఇళ్ల స్థలాల కోసం భూములు కొన్నారని, ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కూడా అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాతో రోజూ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
    Published by:Nagesh Paina
    First published: