CM Jagan Odisha TOur update: ఒడిషా సీఎం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik)తో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) భేటీ సుదీర్ఘంగా సాగింది. ఒడిషా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ముఖ్యంగా మూడు అంశాలే అజెండాగా ఇద్దరు సీఎంలు చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయడానికి ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇద్దరు సీఎంలు అంగీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఒడిషా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో సానుకూలంగా చర్చించారు. కోఠియా గ్రామాలపై ఎక్కువ సమయంలో మాట్లాడుకున్నా.. తరువాత వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ముంపు గ్రామాల సమస్యపై సీఎంలు చర్చించారు. బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించారు.
ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిషా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండిAP Cabinet: ఆమ్మో మంత్రి పదవా నాకొద్దు బాబోయి.. ఎమ్మెల్యేలకు ఎందుకంత భయం
సీఎం జగన్ షెడ్యూల్ సాగిందిలా..
ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ అక్కడ నుంచి విశాఖకు చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఆయనకు స్టేట్‌గెస్ట్ హౌస్‌లో ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆతర్వాత ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మరో దఫా స్వల్ప సమావేశం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఒడిశా సచివాలయం లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు సీఎం జగన్. జగన్‌కు సాదరస్వాగతం పలికారు. తరువాత కన్వెన్షన్ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది.
ఇద్దరు సీఎంల చర్చల్లో ముఖ్య అంశాలు
రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్షలో ఇరు రా ష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీలతో జాయంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా ప్రకటించారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారంపై ఈకమిటీ దృష్టిపెడుతుందని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. కొఠియా గ్రామాల సమస్య,
నేరడి బ్యారేజీ,
జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టులో మిగిలిపోయిన భాగం పూర్తి లాంటి మూడు ప్రధాన అంశాలతో పాటు వివిధ అంశాలమీద చర్చ జరిగినట్టుగా ఆయన సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. పోలవరం కారణంగా పాక్షికంగా ముంపునకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై సీఎం జగన్ సూచనలు చేశారు.
బలిమెల, అప్పర్ సీలేరులో విద్యుత్‌ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌ఓసీ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. బహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురంకు నీటి విడుదలపైనా ఇద్దరు సానుకూలంగా చర్చించారు. ఈ అంశాలపై దృషిసారించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి జాయింట్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం నవీన్ ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఇద్దరు సీఎంలు.
.Joint Statement of HCM Odisha and HCM AP on 9th November 2021, Bhubaneswar
ప్రకటనలో కీలక అంశాలు..
మావోయిస్టు కార్యకలాపాల నియంత్ర, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించాలని, కలికట్టుగా ఎదుర్కోవాలని ప్రకటనలో రెండు రాష్ట్రాలు పేర్కొన్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షలు నిర్వహణను సోదరభావం పెంపొందించేందుకు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంజిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: అడవి అంచున అల వైకుంఠపురం.. చరిత్ర గతిని మార్చుకున్న ఓ పల్లె కథ
సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...
సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలు ఉన్నాయని.. తొలిసారిగా ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకేశామన్నారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. చీఫ్‌సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుందన్నారు. కేవలం చర్చలు జరపడమే కాదు, జాయింట్ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: అమ్మో జెల్లీ ఫిష్.. సాగర తీరంలో కలకలం.. టచ్ చేస్తే అంతే.. ఎందుకంత ప్రమాదం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Naveen Patnaik, Odisha