Home /News /politics /

ANDHRA PRADESH CM JAGAM MOHAN REDDY CLARITY ON TDP CHIEF CHANDRABABU TEAR ON YCP COMMENTS NGS GNT

CM Jagan: చంద్రబాబు కుంటుంబంపై వ్యాఖ్యలు.. కన్నీరు పై సీఎం జగన్ వివరణ.. ఏమన్నారంటే..?

చంద్రబాబు ఏడుపై సీఎం జగన్ క్లారిటీ

చంద్రబాబు ఏడుపై సీఎం జగన్ క్లారిటీ

CM Jagan on Chandra Babu: 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు. మీడియా సమావేశంలో తొలిసారి వెక్కి వెక్కి ఏడ్చారు.. ఏపీ అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే తన భార్యను కూడా అవమానిస్తున్నారంటూ ఉధ్వేగానికి లోనయ్యారు. అయితే చంద్రబాబు కన్నీరు.. ఆయన విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. అసలు ఏం జరిగిందో వివరణ ఇచ్చారు..

ఇంకా చదవండి ...
  CM Jagan on Chandra Babu: ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ (Andhra Pradesh Assembly) లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. సభలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు సభలో అడుగు పెట్టనని శపథం చేశారు.. ఆ తరువాత మీడియా సమావేశంలో అయితే వెక్క వెక్కి ఏడ్చారు. తన కుటుంబాన్ని కూడా అవమానించడంతో అంత ఉద్వేగానికి గురయ్యాను అన్నారు. అయితే ఈ విమర్శలు, చంద్రబాబు కన్నీటిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఆ సమయంలో తాను సభలో లేనని, సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేశానని తెలిపారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు పొలిటికల్‌ అజెండానే ముఖ్యమని.. ప్రజలస సమస్యల గురించి ఆయనకు పట్టందంటూ జగన్ విమర్శించారు..

  తన నియోజకవర్గం కుప్పం ప్రజలు తిరస్కరించడం.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం.. కౌన్సిల్‌ ఛైర్మన్‌గా వైయస్సార్‌సీపీకి చెందిన దళితుడు నియామకం కావడం లాంటివి అన్నీ చంద్రబాబు తట్టుకోలేక ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని.. అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రజా సమస్యలు కాని.. అసెంబ్లీకి గానీ సంబంధంలేని టాపిక్‌ను చంద్రబాబు సభలోకి తీసుకొస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని జగన్ ఆరోపించారు..
  ఇదీ చదవండి : వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. సంచలన ప్రెస్ మీట్

  ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే.. కావాలని వాటిని తప్పు పడుతూ.. తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు అధికార పక్షం నేతలు మాట్లాడుతారని.. దానికి కూడా ఫ్రస్టేషన్ గా ఫీల్ అయితే ఎలా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్తున్నట్టుగా అలాంటి మాటలేవీ అధికార పక్షం నుంచి మాట్లాడలేదన్నారు. ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా ఆనాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపై కూడా చర్చ జరగాలని అధికారపార్టీ సభ్యులు అంటే తప్పేంటని జగన్ ప్రశ్నించారు..

  ఇదీ చదవండి : అల్లకల్లోలంగా తిరుపతి-తిరుమల.. ప్రకృతి ప్రకోపానికి కారణం ఇదేనా..? వరద నీటిలో చంద్రబాబు ఇళ్లు..

  చంద్రబాబు రెచ్చగొడుగుతున్నారు కాబట్టే అధికార పార్టీ నేతలు ఆ మాటలైనా అనాల్సి వచ్చింది అన్నారు. సభలో ఎవరూ ఎక్కడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. అవతల వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు జగన్. మా చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారని గుర్తు చేశారు. అధికారపక్షం నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నారు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు సభ నుంచి వెళ్లిపోతూ శపథాలు చేశారన్నారు. ఇవన్నీ మన కళ్లముందే చూశామన్నారు. అన్నీ దేవుడు చూస్తాడని జగన్ వ్యాఖ్యానించారు.

  ఇదీ చదవండి : మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగు.. సభలో చంద్రబాబు శపథం

  వ్యవసాయంపై సభలో చర్చ సందర్భంగా విపక్షాలు లేకపోవడం బాధాకరమన్నారు జగన్. ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతు సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చామన్నారు సీఎం జగన్.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు