• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH CHIEF MINISTER YS JAGANMOHAN REDDY FACILITATES GRAMA WARD VOLUNTEERS DURING UGADI FULL DETAILS HERE PRN

AP CM YS Jagan: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఇక నుంచి ప్రతి ఏటా సత్కారం

AP CM YS Jagan: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఇక నుంచి ప్రతి ఏటా సత్కారం

వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP Cm YS Jaganmohan Reddy) వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వాలంటీర్ల సత్కారం సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరుతున్నాయన్నారు. సొంతలాభం కొంత మానుకొని పక్కవారికి సహాయం చేస్తున్న అందరికీ హృదయపూర్వక జగన్ అభినందనలు తెలిపారు. పథకాలకు రాష్ట్రంలో గ్రామగ్రామానా, వాడవాడలా సంధాన కర్తలుగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నిస్వార్ధంగా పనిచేస్తున్నారని సీఎం అన్నారు. వాలంటీర్ల సేవలకు మనసారా సెల్యూట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు 97 శాతం మంది యువకులే ఉండటం గర్వకారణని.. ఇందులో 50శాతం మంది మహిళలే ఉండటం సంతోషంగా ఉందన్నారని జగన్ అన్నారు. వీరంతా పేదలు బాధలు అర్ధం చేసుకున్నవారేనని అన్నారు. వివక్షకు తావులేకుండా ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్ని ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజలకు చేరవేస్తున్నారని సీఎం జగన్ ప్రశంసించారు. వ్యవస్థను చక్కగా అమలు చేస్తున్న వారంతా నా వాలంటీర్లేనని గర్వంగా చెప్తున్నానని ఆయన అన్నారు.

    ప్రతి ఏడాది సత్కారం..
    రాష్ట్ర వ్యాప్తంగా సేవా మిత్ర అవార్డు కింద 2,18,115 మందిని సత్కరిస్తున్నామన్నారు. ఈ కేటగిరీలో ప్రతి వాలంటీర్ కు రూ.10వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా బ్యాడ్జి అందిస్తున్నామన్నారు. సేవారత్న అవార్డు కింద 4వేల మంది వాలంటీర్లుకు రూ.20వేలు నగదు, పతకం, శాలువా, బ్యాడ్జీ అందజేస్తున్నట్లు సీఎం తెలాపారు. మూడో కేటగిరీ అయిన సేవా వజ్ర అవార్డు కింద 875 మందికి రూ.30వేల నగదు సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ఇస్తున్నామన్నారు. ఇక ప్రతి ఏడాది వాలంటీర్లకు సత్కారం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి ఏడాది వాలంటీర్లు మెరుగైన పనితీరు కనబరచాలని పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: వకీల్ సాబ్ పై ముదురుతున్న వివాదం.. రంగంలోకి నాగబాబు.. ట్విట్టర్ వార్ షురూ..


    ప్రభుత్వం అందించే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వైఎశ్ఆర్ పెన్షన్ కానుక వంటి పథకాలు వాలంటీర్ల వల్లే సక్రమంగా అమలవుతున్నాయన్నారు. 20 నెలలుగా ఏమీ ఆశించకుండా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోందన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలోనూ రోజుకు ఓ నియోజకవర్గం చొప్పున వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారని జగన్ అన్నారు.

    ఇది చదవండి: కాయ్ రాజా కాయ్.., ఐపీఎల్ క్రేజ్ వెనుక చీకటి దందా..


    విమర్శలు పట్టించుకోవద్దు..
    వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్ష నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని సీఎం జగన్ విమర్శించారు. క్రమశిక్షణగా ఉన్నంత కాలం వాలంటీర్లు ఎలాంటి విమర్శలకు భయపడవద్దని పిలుపునిచ్చారు. విమర్శలు చేసేవారి పాపాన వారినే వదిలేయాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని హామీ ఇచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు