news18-telugu
Updated: February 6, 2020, 7:06 AM IST
సీఎం జగన్, ఏపీ మ్యాప్
ఏపీ మూడు రాజధానులపై సీఎం జగన్ కొత్త వ్యూహాన్ని రచించారు. అమరావతి విషయంలో ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేసేందుకు కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కూడా మూడు రాజధానుల వల్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నేటి నుంచే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ రోజు మానవ హారాలు నిర్వహించాలని, రేపు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇక.. 8వ తేదీన చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుతూ వైసీపీ శ్రేణులు పూజలు చేయనున్నారు. ఇలా 15వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మూడు రాజధానులపై మెప్పు సాధించేందుకు రెడీ అయ్యారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఆ వేదికగానే టీడీపీ అవినీతిని ఎండగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. రాజధాని తరలింపుతో నష్టం రైతులకు కాదని, కేవలం టీడీపీకేనని చెప్పేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ఈ బాధ్యతలు వైసీపీ విద్యార్థి యువజన విభాగాలకు అప్పజెప్పనుంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 6, 2020, 7:06 AM IST