హోమ్ /వార్తలు /రాజకీయం /

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశం..

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశం..

ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్

ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్

YS Jagan: వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం ప్రారంభమైంది. జగన్‌తో గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సవాంగ్ మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తనదైన మార్క్ పాలనను జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కీలక శాఖలకు చెందిన ముఖ్య అధికారులను బదిలీ చేశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేసిన ఆయన.. విజయవాడ పోలీస్ కమిషనర్‌‌గా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌‌ను డీజీపీగా నియమించారు.


దీంతోపాటు ఏపీ ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కుమార్ విశ్వజీత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను నియమించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

First published:

Tags: AP DGP, Gautam Sawang, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు