YS Jagan About Roads: ఏపీలో రోడ్ల దుస్థితిపై సీఎం జగన్ దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు...

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల పరిస్థితిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ  జనసేన (Janasena Party),  తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. అక్టోబర్ నెలాఖరుకల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ఆ తర్వాత అభివృద్ధి పనులకు అనువైన పరిస్థితలుంటాయన్నారు. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నంటినీ బాగు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న జగన్.. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా వదిలేశారని విమర్శించారు.

  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా కురుస్తున్నాయన్న సీఎం జగన్.. వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాలు కురవడం వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. రహదారులను బాగుచేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టిందన్నారు. వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని.. ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

  ఇది చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..


  అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపించినా.., ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు సీఎం కుర్చీలో లేకపోవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ప్రతి విషయాన్ని వక్రీకరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేసినా మనం చేయాల్సిన పనులు మనం చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్‌ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారన్నారు. మనం బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయన్నారు జగన్.

  ఇది చదవండి: వినాయకుడి చుట్టూ ఏపీ రాజకీయాలు... ఉత్సవాల రద్దుపై ప్రజల ఆగ్రహం


  రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచామన్న జగన్.. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

  ఇది చదవండి: కాంట్రాక్టర్ కు వైసీపీ లీడర్ వార్నింగ్... అధికారపార్టీకి మళ్లీ తలనొప్పులు..


  న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో కొత్త రోడ్లకు నిర్మాణానికి కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రాలనుంచి జిల్లాకేంద్రాలకు రెండు లేన్లతో మంచి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలను సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రగతి, ప్రతిపాదనలపై సీఎంకు వివరాలు అందించారు.

  ఇది చదవండి: ఏపీలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో హై అలర్ట్..


  కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రోడ్డు, విశాఖపట్నంలో షీలానగర్‌ – సబ్బవరం జాతీయ రహదారి, విశాఖపట్నం సిటీ గుండా అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధానమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వీలైనంత త్వరగా కార్యరూపంల దాల్చేలా తగిన చర్యలుతీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

  ఇది చదవండి: సాహసమే వారి ఊపిరి.. లక్ష్యం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది.. విశాఖ కుర్రాళ్లా మజాకా..!


  ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కె వెంకటరెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  Published by:Purna Chandra
  First published: