కాసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. అందుకేనా..

ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారశైలిపై చంద్రబాబు ఈసీకి నిరసన తెలియజేయనున్నారు. చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 17, 2019, 12:02 PM IST
కాసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. అందుకేనా..
చంద్రబాబు (ఫైల్)
news18-telugu
Updated: May 17, 2019, 12:02 PM IST
రంజు రంజుగా దేశ రాజకీయాలు.. ఫలితాలకు ఇంకా ఆరు రోజుల సమయం ఉన్నా ఆ వేడి ఇప్పుడే సెగలు కక్కుతోంది. ఏపీలో అధికారం ఎవరిదో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ అధికారం చేపడతారని, కాదు.. మళ్లీ చంద్రబాబుదేనని ఎవరి అంచనాల్లో వారున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30కి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వ్యవహారశైలిపై చంద్రబాబు ఈసీకి నిరసన తెలియజేయనున్నారు. చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎన్ఆర్ కమ్మపల్లె, క‌మ్మప‌ల్లె, పులివ‌ర్తి ప‌ల్లె, కొత్త కండ్రిగ‌, వెంక‌ట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్సీలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేత చెవిరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మరోవైపు,రాహుల్, శరద్ పవార్,శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాతోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. ఆయన లఖ్‌నవూ వెళ్లి అక్కడ మాయావతితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడయ్యాక తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...