నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ని కలవనున్న చంద్రబాబు

ఏపీ భవన్ నుంచి ర్యాలీగా సీఎం చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 7:47 AM IST
నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ని కలవనున్న చంద్రబాబు
ఏపీకి మోదీ చేసిన అన్యాయానికి నిరసనగా నల్లచొక్కా ధరించిన చంద్రబాబు
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 7:47 AM IST
ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. 11 మంది సభ్యుల బృందంతో ఆయన రాష్ట్రపతితో భేటీ కానున్నారు. మొత్తం ఏపీకి సంబంధించిన 18డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి అందివ్వనున్నట్లు సమాచారం. ఏపీ భవన్ నుంచి ర్యాలీగా సీఎం చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.

ఏపీకి విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఆయన సోమవారం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం దీక్షకు కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎస్సీ నేత ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సహా ప్రముఖ జాతీయ నేతలంతా మద్దతు పలికారు. ప్రధాని మోదీ వైఖరిని ఎండగట్టారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇవాళ కూడా ఢిల్లీలోనే మకాం వేసిన ఏపీ సీఎం రాష్ట్రపతిని కలిసేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ధర్మపోరాట దీక్షతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చాటిచెప్పామని ఆయన అన్నారు. మనం ఏకాకులం కాదని.. యావత్ దేశమంతా ఏపీకి అండగా ఉందని చెప్పారు. బీజేపీ అండ్ కో తప్ప..అన్ని పార్టీలూ దీక్షకు సంఘీభావం తెలిపాయన్నారు చంద్రబాబు.



First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...