భద్రాచలంను మేమే తీసుకుంటాం... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

భద్రాచలం మునిగిపోతుందనే కారణంతో పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... భద్రాచలం కూడా తమదే అని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 4, 2019, 4:12 PM IST
భద్రాచలంను మేమే తీసుకుంటాం... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబునాయుడు
  • Share this:
ఎన్నికల ప్రచారంలో భాగంగా గిద్దలూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం మునిగిపోతుందనే కారణంతో పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని చంద్రబాబు... భద్రాచలం కూడా తమదే అని వ్యాఖ్యానించారు. భద్రాచలంను కూడా తామే తీసుకుంటామని అన్నారు. తాను రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కష్టపడుతుంటే... ప్రతిపక్షం రాక్షసుల మాదిరిగా అడ్డుపడుతోందని ఆరోపించారు. ఆంధ్రా ప్రజలను తిట్టి... ఈ ప్రాంత పురోగతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌తో జగన్ కలిశారని చంద్రబాబు మండిపడ్డారు.

వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సహా అనేక నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగా పులివెందులకు సాగునీరు అందించామని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ బెదిరింపులకు తాను భయపడబోనని చంద్రబాబు అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టే విధంగా ఐటీ దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్‌ కాల్వలకు గోదావరి నీటిని తరలిస్తామని తెలిపారు.

First published: April 4, 2019, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading