Home /News /politics /

చంద్రబాబు, లోకేశ్‌కు మైనింగ్ మాఫియాలో వాటాలు: జగన్

చంద్రబాబు, లోకేశ్‌కు మైనింగ్ మాఫియాలో వాటాలు: జగన్

మే 12న ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు. సుమారు 10 రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉంటారు.

మే 12న ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు. సుమారు 10 రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉంటారు.

గురజాలలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సినిమా ధియేటర్ల యజమానులు సైతం స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు.

    గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ మాఫియాగా మారపోయారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయనతో కలిసి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారులను ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని వేధిస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్ జరిగిందని జరిమానాలు విధించాయని అన్నారు. గురజాలలో అభివృద్ధి చెందింది కేవలం యరపతినేని శ్రీనివాసరావు మాత్రమే అని దుయ్యబట్టారు. ఇంతకంటే మైనింగ్ సామ్రాజ్యం రాష్ట్రంలో ఎక్కడా లేదని అన్నారు.

    సినిమా ధియేటర్ల యజమానులు సైతం స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు. గురజాలలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత వ్యాఖ్యానించారు. లక్ష మంది ఉండే పిడుగురాళ్లలో వంద పడకల ఆస్పత్రి లేదని జగన్ తెలిపారు. ఇక్కడి రైతులను పట్టించుకునే వారేలేరని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటామని అన్నారు. తమ హామీలను కాపీ కొట్టి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని రూపొందించారని వైసీపీ అధినేత అన్నారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయని చంద్రబాబు... ఎన్నికలు వస్తున్నాయనే హడావిడిలో అనేక పథకాలు కాపీ కొట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు.




    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Guntur S01p13, Lok Sabha Election 2019, Narasaraopet S01p14, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు