Home /News /politics /

ANDHRA PRADESH CABINET WHO WILL BE OUT WHO WILL BE IN MINSTER ANIL KUMAR ALSO DOUBT NGS

AP Cabinet: భక్తుడిగా చెప్పుకునే మంత్రికి సీఎం షాక్..! కేబినెట్ నుంచి వేటు తప్పదా..? ఇవే హింట్స్..

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ లో కీలక మంత్రులకు షాక్ ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారా..? అధినేతను దేవుడిగా భావించే మంత్రులపైనా వేటు తప్పదా..? ఇప్పటికే సీఎం జగన్ వారికి హింట్లు కూడా ఇస్తున్నారా...?

  ఏపీ సీఎం జగన్ టీంలో ఎందరు మంత్రులు ఉన్నా.. ఆ మంత్రిది మాత్రం ప్రత్యేక స్థానం.. అసలు తాను ఎమ్మెల్యేను కాదు.. మంత్రిని కాదు జగన్ భక్తుడిని అని చెప్పుకుంటారు ఆయన.. అంతేకాదు సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే అస్సలు తట్టుకోలేరు.. వెంటనే వారిపై విరుచుకు పడతారు. జగన్ పై ఈగ వాలినా ఒప్పుకోను అనే నైజం.. అయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది.. అవును మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అయితే ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించడం ఏంటి అని డౌట్ పడుతున్నారా.. కానీ అదే జరిగుతుందనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ చాలా హింట్లు ఇచ్చారని అంటున్నారు.. కచ్చితంగా అనిల్ పై వేటు పడుతోందని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండనుంది. ఇప్పటికే మహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సీఎం జగన్ మంత్రులకు కొన్ని హింట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

  ఇటీవల ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి రోజాను పక్కకు తప్పించడంతో పరోక్షంగా ఆమెకు కేబినెట్ లో బెర్త్ ఖాయమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు జక్కంపూడి, మల్లాది విష్ణు కూడా రేస్ లో ఉన్నారు. ఇక ఎవరెవర్ని తప్పిస్తారనే జాబితాలో తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా చేరడం ఆశ్చర్యాన్ని ఇస్తోంది. అందుకు తాజా ఉదహరణ సీఎం జగన్ పోలవరం పర్యటన. ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్నారంటే.. కచ్చితంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ ఆయన పక్కనే ఉంటారని అంతా అనుకుంటారు. ఉన్నారు కూడా, కానీ చాలా పరిమితంగానే కనిపించారు. అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రి ప్రాధాన్యం అంతంతమాత్రంగానే ఉంది.

  ఆ తర్వాత ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ వెనకబడిపోయారు. ఏరియల్ వ్యూ విషయంలో సీఎం జగన్, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కి ప్లేస్ మిస్ అయింది. కేవలం హెలికాప్టర్ లోనేనా, లేక కేబినెట్ లో కూడానా అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మంత్రి పదవుల్లో యువతకు ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్.. వారి పనితీరుని కూడా మదింపు చేస్తూ వచ్చారు. కరోనా కష్టకాలంలో ఎవరు ఎలా పనిచేశారు, తమ శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది.

  ముఖ్యంగా జలవనరుల శాఖ విషయానికొచ్చే సరికి ఎక్కడో తేడా కొట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల జలవివాదం సమయంలో కూడా తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారే కానీ, ఏపీలో సదరు శాఖ సరిగా స్పందించలేదనే వాదన ఉంది. అదే సమయంలో సజ్జల సహా ఇతర మంత్రులు, నేతలు తెలంగాణ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీలోని జలవనరుల శాఖ మాత్రం సరైన కౌంటర్ ఇవ్వలేకపోయిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ మనసులో ఏముందో చెప్పలేం. అలాగని ముందస్తుగా ఇచ్చే ఇలాంటి ఇండికేషన్లను కొట్టిపారేయలేం అంటున్నారు వైసీపీ నేతలు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP cabinet, AP News

  తదుపరి వార్తలు