AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (Andhra Pradesh Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను ఆమోదించింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (Andhra Pradesh Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి (Amaravathi) సచివాలయంలో (AP Secretariat) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను ఆమోదించింది. ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చించింది. రెండో విడత వైఎస్సార్‌ ఆసరా పథకానికి (YSR Asara Scheme) కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి (Housing Loan) రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణ సౌకర్యం కల్పించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థలకు వివిధ సదుపాయాలు కల్పించే దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. అలాగే మైనార్టీలకు సబ్‌ ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు పెన్షన్ల తొలగింపు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో చర్చజరిగింది.

  కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. పేదల ఇళ్లను సొంత ఆస్తులుగా మార్చేందుకు వన్ టైమ్ సెటిల్మెట్ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. 1983-2011 ఆగస్టు 15 మధ్య ప్రభుత్వ ఇళ్లు నిర్మించుకున్నవారికి వన్ టైమ్ సెటిల్మెంట్ కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఆ ఇళ్లను సొంత ఆస్తిగా మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వం తీర్మానించింది. దీని ద్వారా 46,67,301వేల మందికి లబ్ధి చేకూరనుంది. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కింద గ్రామాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు కేబినెట్ నిర్ణయిచింది. అలాగే తనఖాలో ఇళ్లు కొనుక్కున పేదలకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

  ఇది చదవండి: బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన ఏపీ మంత్రి సతీమణీ... వీడియో వైరల్..


  ఇక ప్రభుత్వ ద్వారా స్థలాలు పొంది ఇళ్లు నిర్మించుకునేవారికి లోన్లు తీసుకునే అవకాశం కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 180000 సరిపోకపోతే.. డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రూ.35వేలు రుణం ఇప్పించనుంది. దీనికి మొత్తం 9శాతం వడ్డీకాగా.. మిగిలిన 6శాతం ప్రభుత్వం భరిస్తుంది. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్వాక్రా మహిళలను సచివాలయాల స్థాయిలో సమావేశపరిచి రుణాలిస్తా. మొదటి విడతలో ఆసరా లబ్ధి పొందనివారికి రెండో విడతలో రెండూ కలిపి చెల్లించనుంది.

  ఇది చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్... జర్నీ అలర్ట్ మెసేజ్ లో కీలక మార్పు..


  విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ భూముల్లో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణానికి అనుకూలమైన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎల్జీపాలీమర్స్ కు అనుమతిచ్చింది. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకానికి చట్టసవరణకు ఓకే చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వ సస్థ అయిన సెకీ భాగస్వామ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 10వేల మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ విద్యుత్ అంతా వ్యవసాయానికి యూనిట్ రూ.2.49కే సరఫరా చేసేలా నిర్ణయించింది.

  ఇది చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.., ప్రభుత్వానికి ఊరట


  సమావేశంలో పెన్షన్ల తొలగింపు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పెన్షన్ల తొలగింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించినట్లు సమాచారం. ధనికులు పెన్షన్లు తీసుకుంటున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: