AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే... ఇళ్ల నిర్మాణంపైనే ఫోకస్..!

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (Andhra Pradesh Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలకు ఆమోదముద్ర వేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ పూర్తవడంతో త్వరలోనే వెటర్నరీ అంబులెన్సులను కొనుగోలు చేయనుంది. ఇక వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 28 లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీగా ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గం ఆమోదించింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి ఓకే చెప్పింది. ఇక జగనన్న అమ్మఒడి పథకం కింద 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించే అంశాలనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటు, విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జేఎన్టీయూ చట్టం-2008కి సవరణకు అంగీకారం తెలిపింది. ఇక మౌలిక సదుపాయల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం తెలిపింది. అలాగే 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.

    కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చింటిన మంత్రివర్గం మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచ్చింది. రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. విశాఖ జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కు 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపింది. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా కోసం తొలిదశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. వైద్యశాఖలో మౌలిక సదుపాయల కల్పనపై చర్చించిన మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇక విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    వీటితో పాటు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీకి ముందు సీఎం జగన్ కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.150 కోట్లతో కొండవీడు వాగు ఎత్తిపోతల నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును విస్తరించనున్నారు. రెండు వరుసల రోడ్డుతో పాటు ఫుట్ పాత్ కూడా నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
    Published by:Purna Chandra
    First published: