AP Cabinet: విశాఖలో ఆ కీలక నేతకు త్వరలో కేబినెట్ బెర్త్? మరి మంత్రి అవంతి పరిస్థితి ఏంటి..?

విశాఖలో ఆ కీలక నేతకు కేబినెట్ లో బెర్త్.. మరి అవంతి పరిస్థితి ఏంటి?

ఏపీకి కాబోయే రాజధాని విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతకు త్వరలోనే కేబినెట్ బెర్త్ దక్కనుందా..? ఇప్పటికే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అవంతి పరిస్థితి ఏంటి..? కేబినెట్ విస్తరణలో ఈ సారికి ఎవరికి చోటు దక్కే అవకాశం ఉంది..?

 • Share this:
  ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18                                                                                     సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తైంది. అయితే ముందుగానే రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు ఆయన.. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం మొదలైంది. దీంతో ఆశావాహులు ఎవరికి వారు తమ లాబీయింగ్ ను ముమ్మరం చేశారు. సీఎం జగన్ చూపు తమపై పడేలా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే త్వరలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతున్న విశాఖపైనే ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. సీఎం ఢీల్లీ పర్యటన ముగిసిన తరువాత విశాఖ రాజధాని పనులు ముమ్మరం అయ్యాయి. త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పరిపాలనా రాజధాని విశాఖలో నెక్ట్స్ ఎవరు..? ఏ ఎమ్మెల్యే మంత్రి అవుతారనేది చర్చనీయంగా ఉంది. అయితే ఈ రేసులో ముందు వినిపిస్తున్న పేరు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడదే.. ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావును తప్పించి గుడివాడ అమర్ నాథ్ ను మంత్రి చేస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ మొదలైంది.

  విశాఖలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటే.. వారిలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) కొనసాగుతున్నారు. అయితే రాజధాని పేరుతో రెండో మంత్రి పదవి విశాఖకు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అవంతితో పాటు మరో ఎమ్మెల్యేను కేబినెట్ లోకి తీసుకుంటారని ఒక వర్గం చెబుతోంది. మరో వర్గం మాత్రం అవంతిని మంత్రిగా తొలగించి.. గుడివాడను నియమిస్తారని ప్రచారం చేస్తోంది. మరి ఇందులో ఏది వాస్తవం..

  ఇదీ చదవండి: ఆ టీడీపీ కీలక నేత ఇఫ్పుడెక్కడున్నారు? రాజకీయ వ్యూహమా..? అజ్ఞాతంలో ఉన్నారా..?

  అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు రాజకీయంగా కాస్తంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకుడే. విమర్శకి ప్రతి విమర్శలు కూడా అంతే గట్టిగా ఉంటాయి. సామాజికవర్గ సమీకరణాల్లో కూడా ఆయనకే పెద్ద ప్లస్ ఉంది. విశాఖలో గుడివాడ ఇంటిపేరు చిన్నదేం కాదు. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గుర్నాధరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తాత గుడివాడ అప్పన్న పెందుర్తి నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే. తండ్రి, మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు కూడా జిల్లాలో డైనమిక్ లీడర్. కాంగ్రెస్ రాజకీయాలను కొన్నేళ్ళ పాటు గట్టిగానే శాసించారు. ఇక ఆయన వారసుడిగా గుడివాడ అమరనాధ్ టీడీపీలో కార్పోరేటర్ గా గెలిచి ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసి ఇంతటి లీడర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన గుడివాడ అమరనాథ్ అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో నెగ్గారు.ఇక 2019లో వైసీపీ గెలిచిన తరువాత విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి కి వినిపించిన పేర్లలో ఆయనది కూడా ఒకటి.

  ఇదీ చదవండి: వైసీపీలోకి సంచయిత..? మంత్రులు బొత్స.. పుష్పశ్రీవాణికి చెక్ పెడతారా..!

  గుడివాడకు ఈ సారి చ్చితంగా రూరల్ కోటాలో అయినా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. గతంలోనే ఆయనకి మంత్రి పదవి రావాల్సి ఉన్నా.. రాజకీయ సమీకరణాల నేపద్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. ఇటు విజయసాయిరెడ్డికి అటు జగన్ కి కూడా అంత్యంత సన్నిహితంగా ఉంటున్నారు గుడివాడ.. అందుకే మంత్రి కావడం ష్యూర్ అంటున్నారు. ఏడాది చివరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటున్న నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. రాబోయే కాలానికి కాబోయే మంత్రి అంటూ గుడివాడ అనుచరలు హల్ చల్ చేస్తున్నారు. అమరనాథ్ మంత్రి కావడం ఖాయం, ఎవరూ ఆపలేరు అంటూ గుడివాడ అభిమానులైతే తెగ హడావుడి చేస్తున్నారు. మొత్తానికి గుడివాడ అమరనాథ్ కు ఇది ఆనందించే విషయంగా ఉన్నా వైసీపీ రాజకీయాల్లో మాత్రం అతి పెద్ద చర్చగా ఉంది.

  ఇదీ చదవండి: పది, ఇంటర్ పరీక్షలు రద్దైతే అంతా లోకేష్ లే తాయారవుతారు.. రోజా స్టైల్ సెటైర్లు

  విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రిగా ఉన్న అవంతికి మైనస్ మార్కులు పెద్దగా లేవు. ఆయనకు ముఖ్యమంత్రితో మంచి సాన్నిహిత్యమే ఉంది. ప్రత్యేకించి అవినీతి మచ్చ కానీ, భూ దందాలు చేసిన ఉదంతాలు అంటూ విపక్షాల ఆరోపణలు కూడా లేవు. అటు జగన్ కి ఇటు పార్టీలో నెంబర్ 2 గా భావించే విజయసాయిరెడ్డికీ విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన్ని తప్పించరనే టాక్ కూడా ఉంది. మొదట అనుకున్నట్టు.. మరో మంత్రిపదవి విశాఖకు ఇస్తే.. అలా మంత్రి పదవి ఛాన్స్ వస్తే.. గుడివాడకే వస్తుందని మాత్రం చెప్పుకుంటున్నారు. అమర్ తో పాటు చాలా మంది రేసులో ఉన్నారు. గుడివాడ ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా. అయితే జగన్ కి సన్నిహితుడుగా.. ప్రతిపక్షాన్నిఉతికారేసే వ్యక్తిగా మాత్రం ఆయనకు పేరు ఉంది. స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా అసెంబ్లీలో బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. ఇది సీఎం జగన్ కి కూడా తెలిసిందే. మొత్తానికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published: