ఏపీలో కాబోయే ఇద్దరు మంత్రులు వీరేనా?

AP Cabinet | ఆంధ్రప్రదేశ్‌లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంటకరమణ రాజీనామాతో ఖాళీ అయిన రెండు కేబినెట్ బెర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరి పేర్లు సెలక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: July 15, 2020, 6:38 PM IST
ఏపీలో కాబోయే ఇద్దరు మంత్రులు వీరేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంటకరమణ రాజీనామాతో ఖాళీ అయిన రెండు కేబినెట్ బెర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరి పేర్లు సెలక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిదిరి అప్పలరాజుకు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. స్వతహాగా డాక్టర్ అయిన సిదిరి అప్పలరాజు ఇటీవల కరోనా నియంత్రణ కోసం స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించినట్టు తెలిసింది. మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు. సిదిరి అప్పలరాజు కూడా అదే కమ్యూనిటీకి చెందిన వారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. అలాగే, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉండగా, మూడు ఎమ్మెల్సీలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు తెలిసింది. పిల్లి సుభాష్ వల్ల ఖాళీ అయిన స్థానానికి 9నెలలు మాత్రమే గడువు ఉంది. అందువల్ల ఆ స్థానానికి ఎన్నిక జరగకపోవచ్చంటున్నారు. మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ స్థానాన్ని మర్రి రాజశేఖర్ కు ఇస్తారని గుంటూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటలో రెండు స్థానాలను కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా సుల్తానా అనే మహిళకు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషిన్ రాజు కు కేటాయించబోతున్నట్టు సమాచారం. మోషిన్ రాజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading