ANDHRA PRADESH BUDGETS SESSIONS STARTS FROME MARCH 7TH WILL TDP ATTEND OR NOT NGS GNT
AP Assembly: మార్చి 7నుంచి.. అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ వ్యూహం ఇదేనా..? శపథం మాటేంటి..?
చంద్రబాబు, జగన్ (ఫైల్)
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మరి ఈ సమావేశాలకు టీడీపీ ఎలాంటి వ్యూహాలతో సిద్దమవుతోంది. అసలు సమావేశాలకు హాజరు అవుతుందా..? చంద్రబాబు శపథం మాట ఏంటి..?
AP Assembly: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Bishwa Bushan Harichandan) ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy)కి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendra Nath Reddy)వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ పై అన్ని శాఖల కసరత్తు పూర్తైనట్టు సమాచారం. ముఖ్యమైన బిల్లులకు ఈ సారి సభ వేదిక కానుంది. విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తన్నట్టు టాక్.
మార్చి 7వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనుండగా.. మార్చి 8వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలపబోతుంది. మార్చి 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా కొత్తగా మూడు రాజధానులు, ఏఎంఆర్డిఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మార్చి 11న రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. గత సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. సమగ్రమైన అంశాలతో మళ్లీ ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నటుల చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రానుంది.
కీలక బిల్లులు ప్రవేశ్ పెట్టనున్న ఈ సభకు టీడీపీ వ్యూహం ఏంటన్నదానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత కరువైంది. హాజరైతేనే బెటరని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణంగా చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం కూడా చేశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆయన కన్నీళ్లు దేశ వ్యాప్తంగా రాజకీయంగా చర్చ జరిగింది. ఆ దుమారం ఇప్పటికే ఏపీలో కొనసాగుతూనే ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. చంద్రబాబు చేసిన శపథం ప్రకారం ఆయన సభకు హాజరు కాకూడదు. మరి మిగితా నాయకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.