Tirupahti By-poll: పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీకి అసలు కారణం అదేనా..? పవన్ కామెంట్స్ పనిచేశాయా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై (Tirupathi By-poll) జనసేన (Janasena Party), బీజేపీ పార్టీ (Bharathiya Janatha Party) లు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju).. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో భేటీ అయ్యారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగానే భావించి విజయానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తూ... ఇందుకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విజయంతో నాంది పలికే విధంగా ఇరుపార్టీలు నిర్ణయించాయి. ఎక్కడైనా చిన్నపాటి గ్యాప్స్ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఈ సమావేశంలో  తీర్మానించారు.

    అదే లక్ష్యం
    తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.., ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని సోము వీర్రాజు తెలిపారు. బరిలో దిగే అభ్యర్థి జనసేన నుంచి ఉంటారా.. లేక బీజేపీ నుంచి ఉంటారా అనేది ముఖ్యం కాదన్నారు. తిరుపతిలో ఇద్దరం విజయం సాధించేలా ప్రణాళికలపై చర్చించామన్నారు. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికే పునాదిగా భావిస్తున్నామన్నారు. రెండు పార్టీలు ఎలాంటి సమన్వయం లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామన్న సోము వీర్రాజు.., కుల, మత, వర్గ బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే తిరుపతి అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

    Andhra Pradesh BJP President Somu Veerraju met Janasena Party Chief Pawan Kalyan to discuss about Tirupathi By poll here are the details
    జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ


    పవన్ కామెంట్స్ ఎఫెక్టేనా..?
    ఇటీవల తిరుపతిలో పర్యటించిన సందర్భంగా జనసేన-బీజేపీ పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పార్టీ పీఏసీ సమావేశంలోనూ, ప్రెస్ మీట్లోనూ పవన్ చేసిన కామంట్స్ బీజేపీలో కలకలం రేపాయి. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనన్న పవన్.., బీజేపీ నేతలు తొందరపాటు ప్రకటనలు చేస్తున్నారంటూ మిత్రపక్షానికి కౌంటర్ వేశారు. అంతేకాకుండా తిరుపతి ఎన్నికలను బీజేపీ తేలిగ్గా తీసుకుంటే కుదరదని.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలంత సీరియగా తీసుకొని ప్రచారం చేయాలన్నారు. అలాగే జనసేన పోటీ చేస్తే ప్రచారమంతా తానే భుజాన వేసుకుంటానన్న పవన్.., బీజేపీ అభ్యర్థి బరిలో దిగితే జాతీయ స్థాయి నేతలు వస్తారా అని ప్రశ్నించారు.

    తిరుపతి ఉఫ ఎన్నిక టాపిక్ వచ్చినప్పుడల్లా బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించడం, జనసేనను సపోర్టింగ్ రోల్ కు పరిమితం చేస్తూ వ్యాఖ్యలు చేయడంపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. తిరుపతి పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలపై పంచ్ లు వేశారు. బీజేపీ రాష్ట్రస్థాయి నేతలో గ్యాప్ ఉన్నా.., జాతీయ స్థాయి నేతల నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయంటూ ఏపీ నేతలకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే జనసేన పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న ఓ నేతను బీజేపీ తిరుపతి అభ్యర్థిగా బరిలో దించుతున్నారన్న వార్తలు కూడా పవన్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published: