Home /News /politics /

ANDHRA PRADESH BJP PRESIDENT SOMU VEERAJU HOT COMMENTS BK

Andhra Pradesh BJP: వైసీపీ, టీడీపీ, పార్టీల‌కు ఆ ద‌మ్ముందా? ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

తిరుప‌తి ఉప ఎన్నిక‌లు ఏపీలో వేడిని పుట్టిస్తోన్నాయి. ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే గ్రౌండ్ లెవ‌ల్ లో వ‌ర్క్ స్టార్ట్ చేసేశాయి కూడా అయితే ఈ విష‌యంలో బీజేపీ కాస్త సీరియ‌స్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎలాగైన ఈ సారి త‌మ స‌త్తా చాటాల‌ని పార్టీ నేత‌లు జోరు పెంచుతున్నారు. ఉహించ‌ని స‌వాళ్లు ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు ఇస్తోన్నారు.

ఇంకా చదవండి ...
    తిరుప‌తి ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజేపీ జోరు పెంచింది. సైలెంట్ గా చాప క్రింద నీరులా ఉంటే వ‌ర్క‌వుట్ కాద‌నుకుంటున్నారేమో పార్టీ నేత‌లు అందేకే మాట‌ల్లో ఘాటు పెంచుతున్నారు. తాజాగా రాష్ట్ర‌ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హీట్ పుట్టించే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలు అంతా తమ పార్టీతోనే ఉన్నార‌న్నారు. అక్క‌డితో ఆగ‌కుండా తాము అధికారంలోకి వ‌స్తే బీసీకే ముఖ్య‌మంత్రి కూడా ఇస్తామ‌ని సంచ‌ల‌న వ్యాఖాలు చేశారు సోమువీర్రాజు. తాను వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా ప‌నిలో ప‌నిగా ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు కూడా స‌వాళ్లు విసిరేశారు. త‌మ పార్టీ చెప్పినంత ధైర్యంగా టీడీపీ, అధికార‌పార్టీ వైసీపీ చేయ‌గ‌ల‌దా అని ప్ర‌శ్నించారాయ‌న‌. చేతనైతే బీసీలను సీఎం చేస్తామని వైసీపీ, టీడీపీలు ప్రకటించాలన్నారు. బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బిజెపికే ఉందన్నారు. తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని,,రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయటమే బిజపి లక్ష్యం అన్నారు.

    అయితే ఉన్నట్టుండి సోము వీర్రాజు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డానికి తిరుప‌తి ఉప ఎన్నిక‌లే కార‌ణం అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీలకులు. తిరుప‌తిలో బీసీ ఓటు బ్యాంక్ కాస్త ఎక్కువే అందుకే వారిని ప్ర‌స‌న్నం చేసుకోవాడానికే సోమువీర్రాజు ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని భావిస్తోన్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే టీడీపీ నుంచి భారీ సంఖ్య‌లో నేత‌ల‌ను పార్టీ లోకి ఆహ్వ‌నించ‌డానికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసిన రాష్ట్ర బీజేపీ నేత‌లకు ఆశించిన ఫ‌లితాలు రావ‌డంలేదు. అందుకే ఏపీలో ఎదో ఒక చేసి పార్టీ గ్రాఫ్ పెంచ‌క‌పోతే లాభం లేద‌ని స్పీడ్ పెంచిన‌ట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తిని చూపిస్తున్నారని పార్టీ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి వాస్త‌వానికి అక్క‌డ ఆ ప‌రిస్థితిలు క‌నిపించ‌డం లేదు. వైసీపీ, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో చ‌ర్చ‌ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు త‌ప్ప పార్టీలో ఎవ‌రు చేర‌డం లేదు.
    Published by:Balakrishna Medabayani
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Ap bjp, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Bjp, Chandrababu naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు