రోజాకు బీజేపీ చెక్ మేట్ ప్లాన్.. బరిలోకి మరో ఫైర్ బ్రాండ్ హీరోయిన్

రోజా సెల్వమణి, వైఎస్ జగన్ (File)

ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే సెల్వమణికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష బీజేపీ భారీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలనే ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే సెల్వమణికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష బీజేపీ భారీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలనే ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలు నిర్వహించే సమయానికి నగరిలో మరో ఫైర్ బ్రాండ్ హీరోయిన్‌ను బరిలోకి దింపటానికి బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఆ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ ఎవరో కాదు. వాణి విశ్వనాథ్. ఔను. వాణివిశ్వనాథ్‌ను బీజేపీలోకి తీసుకొచ్చి.. రోజాకు పోటీగా మరో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఆమెను ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్టు కమలదళంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఆమెతో చర్చించినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే తిరుపతి ఉప ఎన్నికల సమయానికి వాణీ విశ్వనాథ్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలు జరిగే సమయంలో జిల్లాకు చెందిన ముఖ్య నేత అయిన రోజా కూడా తప్పకుండా ప్రచారం చేస్తారు. రోజా ప్రచారం చేసిన అన్ని చోట్లా వాణీవిశ్వనాథ్‌తో కౌంటర్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

  ఏపీలో బీజేపీకి సినీ గ్లామర్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. వాణివిశ్వనాథ్‌తో పాటు ప్రియారామన్‌తో కూడా చర్చలు జరిపినట్టు తెలిసింది. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని వారికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి నుంచే బరిలో ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి రోజా మీద పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పినట్టు తెలిసింది. నగరి నుంచి రోజా రెండుసార్లు గెలుపొందారు. 2019లోనే వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. నగరిలో ఆమె రోజా మీద పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆమె పోటీ చేయలేదు. ఇప్పుడు నగరి టికెట్ కన్ ఫాం చేస్తూ వాణి విశ్వనాథ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే, వాణీ విశ్వనాథ్ గతంలో వచ్చి ఓ మెరుపు మెరిసి వెళ్లిపోయారని, ఇప్పుడు మరోసారి ఆమె రావడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని నగరిలో వైసీపీ నేతలు చెబుతున్నారు.

  నగరి నియోజకవర్గంలో రోజా రెండు సార్లు గెలుపొందారు. 2014లో మొదటి సారి, 2019లో రెండోసారి విజయం సాధించారు. అంతకు ముందు ఆమె టీడీపీ తరఫున పోటీ చేసినా కూడా ఓడిపోయారు. పార్టీ మారిన తర్వాత ఆమెను విజయం వరించింది. అటు నియోజకవర్గంలోనూ, ఇటు అసెంబ్లీలో కూడా ఆమె ప్రతిపక్షం మీద విరుచుకుపడుతూ ఉంటారు. జగన్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే నేతలు, జగన్‌ను తరచుగా కలుస్తూ ఉండే నేతల్లో ఆమె కూడా ఒకరు. అలాంటి రోజాను ఢీకొట్టాలంటే అదే స్థాయిలో గ్లామర్ ఉన్న లీడర్‌ను పోటీకి తీసుకురావాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: