ఏపీలో బీజేపీ ఒక విచిత్ర పరిస్థితి ని ఎదుర్కొంటొంది. పార్టీని ఏపీలో బలోపేతం చేయడానికి ఉత్సాహాంగా ముందడుగేసినా ఆ స్థాయిలో సరైనా టీం లేక ఇబ్బంది పడుతుంది. 2019 ఎన్నికల తరువాత ముఖ్యంగా టీడీపీ నుంచి భారీగా తమ పార్టీలోకి వలసలుంటాయని భావించిన పార్టీ నేతలకు నిరాశే మిగిలింది. ఒకరిద్దరు పేరున్న నేతల తప్ప మిగిలిన వాళ్లు కమలం వైపు కన్నెత్తి కూడా చూడాలేదు. దీంతో నాయకత్వాన్ని మార్చితే ఏమైన ఫలితముంటుందేమోనని ఆ పని కూడా చేశారు కేంద్ర బీజేపీ పెద్దలు. అయిన ప్రయోజనం కనిపించడం లేదు. సోమువీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏపీలో బీజేపీ కాస్త యాక్టివ్ గా కనిపిస్తోన్నప్పటికి లోలోపాల తమకు సరైన టీమ్ లేదని భావన క్రింది స్థాయి నేతల నుంచి పై స్థాయి వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు వైసీపీ స్థానం కోసం ప్రయత్నాలు చేయకపోయిన ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఉన్న స్థానంలోకైన వెళ్లాలంటే బలమైన నాయకులు పార్టీ కావాలి. అందులోను ఏపీలో సామాజికవర్గ కాలిక్యూలేషన్స్ ఎక్కువ కాబట్టి అన్ని సామాజికి వర్గాల నుంచి బలమైన నాయుకులను పార్టీలోకి ఆకర్షించగలగాలి. అప్పుడే టీడీపీ స్థానంలోకి పార్టీ వెళ్లగలుగుతంది. అయితే ఇదంత సులువైన పని కూడా కాదు. అందుకోసమే అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర స్థాయి నాయకత్వం ఒక నయా ఆఫర్ తో టీడీపీ నుంచి నేతలను ఆకర్షించే పనిలో పడ్డినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తమ పార్టీలోకి చెరితే వైసీపీ నుంచి వేధింపులుండవని, పార్టీలో చేరితే చాలు వైసీపీ అసలు పట్టించుకోదని రహాస్య మీటింగ్స్ లో చెబుతున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఇదే కాకుండ తమ వ్యాపార లావాదీలతోపాటు అన్ని అంశాల్లో కేంద్ర అండదండలు ఉంటాయని చెబుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే సోమువీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీ లోకి అసలు చేరికలే లేకపోవడం పై పార్టీలో పెద్దలు కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టార్గెట్స్ సెట్ చేసి మరి పార్టీలోకి అవకాశం ఉన్న నేతలందరి చేర్చుకోవాలని వీర్రాజుపై ఒత్తిడి చేస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే సోమువీర్రాజు కూడా గ్రౌండ్ వర్క స్టార్ చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న నేతలతో నేరుగా ఫోన్ సంభాషణలు కూడా ఆయన చేస్తోన్నట్లు సమాచారం.
తమ పార్టీ వద్ద ఉన్న ఆఫర్స్ వాళ్ల ముందు పెట్టి ఆలోచించుకోమని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు, ఆదినారాయణ రెడ్డి, రావేల కిషోర్ బాబు, వరదాపురం సూరి వంటి నేతలు మాత్రమే పార్టీకి చేరారు. అప్పటి నుంచి వాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మీరు కూడా పార్టీలోకి వస్తే మీకు ఏ ఇబ్బందులు ఉండవని అభయం ఇస్తోన్నట్లు విశ్వసనియవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే దాదాపుగా ఏడాది నుంచి పార్టీలోకి చెప్పుకొదగ్గ నేతలు ఏవరు చేరలేదు. ఇప్పుడు ఇదే అటు ఢిల్లీ నేతలను ఇటూ రాష్ట్ర నేతలను కలవరపెడుతున్న అంశం. నాలుగు రోజులు క్రితం వైజాగ్ లో సమావేశమైన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఇదే ప్రధాన ఎజెండాగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి ట్రెండ్ మార్చిన బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Published by:Balakrishna Medabayani
First published:January 22, 2021, 09:41 IST