ANDHRA PRADESH BJP CHIEF TAKE U TURN OVER MAKING BC CANDIDATE AS CHIEF MINISTER OF AP AND SAID THAT PAWAN KALYAN JP NADDA WILL BE THE DECISION MAKERS PRN
AP Politics: ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం..? సోము వీర్రాజు యూ టర్న్
సోము వీర్రాజు (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్ని వర్గాల వారిని తమవైపుకు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము వైఎస్ జగన్ (CM YS Jagan), చంద్రబాబు (Chandrababu naidu) లకు ఉందా అంటూ సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju).
ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో జనసేనతో పొత్తుపెట్టుకొని ముందుకు సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏపీలో జెండా పాతాలను ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే సమస్యలపై పోరాటం చేస్తోంది. అటు ప్రతిపక్ష టీడీపీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని తమవైపుకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము వైఎస్ జగన్, చంద్రబాబులకు ఉందా అంటూ సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అంతేకాదు బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీకే ఉందని ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు.
వీర్రాజు కామెంట్స్ ఇవే..
గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు... బీసీలు అంతా తమ పార్టీతోనే ఉన్నారన్నారు. అక్కడితో ఆగకుండా తాము అధికారంలోకి వస్తే బీసీకే ముఖ్యమంత్రి కూడా ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వ్యాఖ్యలు చేయడమే కాకుండా పనిలో పనిగా ప్రత్యర్ధి పార్టీలకు కూడా సవాళ్లు విసిరేశారు. తమ పార్టీ చెప్పినంత ధైర్యంగా టీడీపీ, అధికారపార్టీ వైసీపీ చేయగలదా అని ప్రశ్నించారాయన. చేతనైతే బీసీలను సీఎం చేస్తామని వైసీపీ, టీడీపీలు ప్రకటించాలన్నారు. బీసీలను సీఎం చేసే దమ్ము ఒక్క బిజెపికే ఉందన్నారు. తాము ఎవరికో పదవి ఇవ్వటానికి పోరాటం చేయటంలేదని,,రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయటమే బిజపి లక్ష్యం అన్నారు.
అంతలోనే యూటర్న్
జగన్, చంద్రబాబులకు సవాల్ విసిరిన 24 గంటల్లోనే వీర్రాజు గారు యూ టర్న్ తీసుకున్నారు. తాను బీసీని చేస్తాను అనలేదని చెప్పారు. అసలు తనకు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేసే అధికారంగానీ, హక్కుగానీ లేవన్నారు. బీజేపీ-జనసేన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి తాను మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో బీసీలకు అండగా నిలిచే పార్టీ తమదేనని చెప్పారు.
సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చే సాగింది. జనసేనతో పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణేనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో బీసీ ముఖ్యమంత్రి అంటూ వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అటు పవన్, ఇటు సోము వీర్రాజు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. పవన్ కల్యాణ్ సీఎం కావాలనే లక్ష్యంతోనే పార్టీ నడిపిస్తున్నారు. అధికారంలోకి రావాలాలనే ఆకాంక్షతోనే బీజేపీతో పొత్తుపొట్టుకున్నారు. ఆ టైమ్ సోము చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకే సోము వీర్రాజు యూటర్న్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.