ANDHRA PRADESH BJP CHIEF SOMU VEERRAJU WRITES DGP GOWTHAM SAWANG AND DEMANDS CLARIFICATION ON BJP ACTIVISTS HAS LINKIED WITH TEMPLS VANDALISM PRN
Andhra Pradesh: డీజీపీ గౌతమ్ సవాంగ్ పై పరువు నష్టం దావా.., ఏపీ బీజేపీ హెచ్చరిక
ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడుల(Hindu Tenples vandalism) వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతోంది. ఇన్నాళ్లూ వైసీపీ (YSRCP)-టీడీపీ(TDP)-బీజేపీ(BJP) మధ్య నడిచిన మాటల యుద్ధం ఇప్పుడు డీజీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడుల వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతోంది. ఇన్నాళ్లూ వైసీపీ-టీడీపీ-బీజేపీ మధ్య నడిచిన మాటల యుద్ధం ఇప్పుడు డీజీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీగా మారింది. ఆలయాలపై జరిగిన దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడంతో తీవ్రదుమారం రేగింది. గౌతమ్ సవాంగ్ పొలిటీషన్ మాదిరిగా మాట్లాడుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సోము వీర్రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ బీజేపీ కార్యకర్తల హస్తమన్నట్లు ప్రకటించారని.. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని కోరారు.
తప్పుడు సంకేతాలు
మీరు చేసిన ప్రకటన వల్ల మీడియాలో బీజేపీ కార్యకర్తలే దాడులు చేసినట్లు వార్తలు ప్రచురితమవుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ వివాదంతో బీజేపీ కార్యకర్తలకు సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. అలాగే విగ్రహాలపై దాడులు చేయడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి చాలా తేడా ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారనడం అర్ధరహితమన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను అరికట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఆలయాలకు రక్షణ కల్పించకుండా కావాలనే తమ పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రకటనలివ్వడం సరికాదన్నారు. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడటం, మరికొన్ని పార్టీలపై నేరుగా విమర్శలు చేయడం తగదని సూచించారు. మీరు చేసిన అస్పష్టమైన ప్రకటన వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాని సోము వీర్రాజు పేర్కొన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ లేఖ
క్రిమినల్ చర్యలు తీసుకుంటాం..
డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ఆరోపణలపై గుర్రుగా ఉన్న బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఘాటు హెచ్చరిక చేసింది. ఆలయాలపై జరిగిన దాడుల ఘటనలో బీజేపీకి సంబంధంముందంటూ చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో పార్టీ పరువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేసినందున పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
డీజీపీ ఏమన్నారంటే..!
ఇక రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న ఘటనలపై ఇటీవల స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్..,ఈ వ్యవహారంలో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. మరి బీజేపీ రాసిన లేఖకు డీజీపీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.