• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH BJP CHIEF SOMU VEERRAJU LAUNCHED E GRAMA SWARAJ APP AND CALL CENTER FOR COMPLAINING ON ATTACKS DURING PANCHAYAT ELECTIONS PRN

AP Panchayat Elections: ఎస్ఈసీ, వైసీపీ దారిలోనే బీజేపీ.., వీర్రాజు సవాల్ కు జగన్, చంద్రబాబు సై అంటారా..

AP Panchayat Elections: ఎస్ఈసీ, వైసీపీ దారిలోనే బీజేపీ.., వీర్రాజు సవాల్ కు జగన్, చంద్రబాబు సై అంటారా..

ఫైల్ ఫోటో

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections).. అసెంబ్లీ ఎలక్షన్స్ (Assembly Elections) ను తలపిస్తున్నాయి. గ్రామాల్లో పట్టుకోసం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు.. అసెంబ్లీ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయి. గ్రామాల్లో పట్టుకోసం పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఏకగ్రీవాలు, దాడుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ E-Watch పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా E-నేత్ర పేరుతో మరో యాప్ రిలీజ్ చేస్తోంది. మేమేం తక్కువ కాదంటూ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకో యాప్ తో ముందుకొచ్చింది. E-గ్రామ స్వరాజ్య యాప్ తో విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా, నామినేషన్లను అడ్డుకున్నా, తప్పుడు కేసులు నమోదు చేసినా యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

    బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఎస్ఈసీకి నేరుగా ఫిర్యాదు చేశామని వీర్రాజు తెలిపారు. తమకు కావాల్సింది యాప్ కాదని.. యాక్షన్ అని సోము అన్నారు. పార్టీ కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగినా అధిష్టానానికి తెలిసేలా కాల్ సెంటర్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు పెడితే ‘9650713714’ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే e-గ్రామ స్వరాజ్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఫిర్యాదులు చేయవచ్చన్నారు సోము.

    పంచాయతీల్లో ఏకగ్రీవాలపేరుతో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఎన్నికల్లో నామినేషన్లను అడుగడుగునా అడ్డుకుంటున్నారని.. ఏదో ఒక రూపంలో తమవారిపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎనికల్లో పోటీకి ముందుకొస్తే అక్రమ మద్యం కేసులు పెడుతున్న ప్రభుచ్వం.. స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం తయారు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్న సోము వీర్రాజు.. ఆ మాట నిజం కాదని వైఎస్ జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విజయసాయి రెడ్డి అనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో వాటర్ గ్రిడ్, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, ఇంటర్నెట్ లాంటి ఎన్నో పథకాలను కేంద్రం అమలు చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్ విసిరిరారు.
    Published by:Purna Chandra
    First published: