HOME »NEWS »POLITICS »andhra pradesh bjp chief somu veerraju demands ys jaganmohanreddy to remove dgp sawang from his post prn

BJP vs DGP: డీజీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.., వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ వార్నింగ్...

BJP vs DGP: డీజీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.., వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ వార్నింగ్...
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (File)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విగ్రహాల ధ్వంసంపై వివాదం కొనసాగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gowtham Sawang) చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party), భారతీయ జనతా పార్టీలు (Bharathiya Janatha Party) మండిపడుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసంపై వివాదం కొనసాగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.., డీజీపీపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మరోసారి సోము వీర్రాజు.., గౌతమ్ సవాంగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.., రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ, టీడీపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలను ఖండించారు.

    డీజీపీని తొలగించాలి


    అంతర్వేదిలో రథం దగ్ధం, రామతీర్థంలో రాముడికి విగ్రహం ధ్వంసం చేయడంతో పాటు పలు ఆలయాల్లో విధ్వంసాలు జరిగితే స్పందించని పోలీసులు.., బీజేపీ కేసులు పెట్టినట్లు ఏకంగా డీజీపీనే చెప్పడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ కు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసా..? తెలియదా..? అంటూ సోము వీర్రాజు నిలదీశారు.  హిందూ మనోభావాలను దెబ్బతీయడమే డీజీపీ పనని విమర్శించారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉండటం ఆ పదవికే అవమానం అని మండిపడ్డారు.

    విగ్రహాల ధ్వంసం కేసును ప్రభుత్వం సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన సోము వీర్రాజు.., తిత్లీ తుఫాన్‌లో విగ్రహం ధ్వంసమైందని సోషల్‌ మీడియాలో పెడితే కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడో ధ్వంసమైన విగ్రహాలకు సంబంధించి.. ఇప్పుడు బీజేపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు ఆగ్రహం మండిపడ్డారు.



    దారి మళ్లించే యత్నం
    విగ్రహాల ధ్వంసం కేసుసలను కేసును దారి మళ్లించేందుకే కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియో బయటపెట్టారని వీర్రాజు ఆరోపించారు. మతం మార్పిడులకు పాల్పడుతున్నందునే వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు జీతాలు ఇస్తుందా అని ప్రశ్నించారు. చర్చిల ఆస్తులపై కేంద్ర హోంశాఖకు నివేదిక పంపుతామని చెప్పారు. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైసీపీ నాయకులు హిందూ ఆలయాల ఆస్తులపై ఆరా తీస్తున్నారు.. ఇతర మతాల ఆస్తులను ఎందుకు పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు నిలదీశారు. విగ్రహాల ధ్వంసం విషయంలో బీజేపీని తప్పుబడుతున్న వైసీపీ నేతలకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు కనిపించడం లేదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ నేతలు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు.
    Published by:Purna Chandra
    First published:January 17, 2021, 13:04 IST