AP Tenth, Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా... సీఎం జగన్ కు సోము లేఖ.. పవన్ బాటలోనే..!

ప్రతీకాత్మకచిత్రం

కరోనా సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు (10th, Inter Exams) నిర్వహించద్దన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెరుగుతున్నాయి. ఇప్పటికే పరీక్షలు రద్దు చేయాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోరగా.. తాజాగా బీజేపీ (Bharathiya Janatha Party) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఈ జాబితీలో చేరారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాజకీయ చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. పవన్ లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ కు లేఖ రాశారు. ఐతే జనసేనాని డిమాండ్ చేసినట్లు పరీక్షలు రద్దు చేయమనకుండా.. వాయిదా వేయాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరముందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయాన్ని గుర్తు చేసిన సోము వీర్రాజు... టెన్త్, టర్ విద్యార్థులకు మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ నెలలో పరీక్షల నిర్వహణ పెద్ద సమస్యగా మారుతుందన్నారు.

    అలాగే ఎగ్జామ్స్ రాసేందుకు విద్యార్థులు బస్సులు, ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో వైరస్ సోకే ప్రమాదముందని సోము వీర్రాజు హెచ్చరించారు. కాబట్టి విద్యార్థుల భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ వియంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.


    ఇది చదవండి: ఏపీ కేబినెట్లో ఎవరు ఇన్... ఎవరు ఔట్..? ఆ మంత్రిగారిపై వేటు ఖాయమా..? రోజాకు ఛాన్సిస్తారా..?


    ఇక కరోనా బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇస్తున్న చికిత్స, వారి వద్ద నుంచి వసూలు చేస్తున్న భారీ ఛార్జీల పైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సోము వీర్రాజు కోరారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయని.. కరోనా చికిత్సకు కొందరు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. దీనివల్ల కుటుంబాలు అప్పులపాలవుతున్నాయన్నారు. కరోనా బాధితుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. తక్కువ ఖర్చుతో బాధితులకు చికిత్స అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చికిత్స ఖర్చులను అధికారులు నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. ఖర్చులపై విధివిధానాలను రూపొందించాలని కోరారు.

    ఇది చదవండి: ఏపీలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు పొందడం ఈజీ... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం


    ఇక కరోనా నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలనని సోము వీర్రాజు అన్నారు. చాలా మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మందులు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమల్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    ఇది చదవండి: ఏపీలో ఈబీసీ నేస్తం పథకం పొందడం ఎలా..? ఇలా దరఖాస్తు చేసుకోండి

    Published by:Purna Chandra
    First published: