ఏపీలో కొత్తగా కొలువు తీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. తొలుత కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పరిపాలన లక్ష్యాలను, విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సేవకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన పోలవరం ప్రాజెక్టును త్వరంలో పూర్తి చేస్తామన్నారు. పాలనలో సంస్కరణలో తీసుకొస్తామన్నారు.
కాగా, గురువారమే గవర్నర్ విజయవాడకు వచ్చారు. నిన్న హైదరాబాద్ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.25 గంటలకు గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ విజయవాడ చేరుకున్న నరసింహన్. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:June 14, 2019, 09:29 IST