HOME »NEWS »POLITICS »andhra pradesh assembly session live governor esl narasimhan speechgovernor narasimhan addressing in joint session of ap assembly sb

AP Assembly- Governor Speech: వైఎస్ఆర్ పాలన తరహాలో అందరికీ ప్రభుత్వ ఫలాలు

AP Assembly- Governor Speech: వైఎస్ఆర్ పాలన తరహాలో అందరికీ ప్రభుత్వ ఫలాలు
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

Andhra Pradesh Assembly Session LIVE | Governor ESL Narasimhan Speech: కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలపారు గవర్నర్ నరసింహన్.

 • Share this:
  మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి ఈ సందర్భంగా గవర్నర్ అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో అమలు ప్రణాళికను గవర్నర్ ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వం చేర్చింది.కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలపారు.పోలవరం ప్రాజెక్టును త్వరంలో పూర్తి చేస్తామన్నారు. పాలనలో సంస్కరణలో తీసుకొస్తామన్నారు గవర్నర్ నరసింహన్. కొత్త విధానాలు అవలంబించి సుపరిపాలన అందిస్తామన్నారు.

  ప్రత్యేక హోదాతో పాటు.. పోలవరం పూర్తి చేసేందుకు నిధుల్ని కేంద్రం నుంచి కోరుతున్ానమన్నారు, డెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని తేలితే.. రివర్స్ టెండరిగ్ వేస్తామన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు గవర్నర్. ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. పేదల జీవితాల్లో వెలుగు నింపుతామన్నారు.  గవర్నర్ ప్రసంగంలోని హైలెట్స్ :

  పరిపాలనలో సమగ్రమైన మార్పులు రావాల్సి ఉంది.
  బడుగువర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం.
  గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ
  రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం.
  వైఎస్ఆర్ పాలన తరహాలో సాచురేషన్ పాటిస్తాం
  ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం.
  పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం.
  రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తాం.
  అవినీతి రూపుమాపేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
  కిడ్నీ బాధితులకు రూ.10500 పెన్షన్
  రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.12500
  రాష్ట్ర విభజన సమస్యలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టింది.
  రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న ప్రతీకుటుంబానికి ఆరోగ్యశ్రీ.
  నవరత్నాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  వ్యవసాయానికి నిరంతరంగా 9 గంటలు విద్యుత్.
  రైతు సమస్యలపై రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం.
  రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
  రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
  ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం
  నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్
  దశలవారీగా పెన్షన్లను రూ.3000కు పెంచుతాం.
  కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం
  వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అక్టోబర్ 1 నుంచి అమలు
  కాపులకు ఐదేళ్లలో పదివేల కోట్లు.
  వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు.
  దశలవారీగా మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నాం.
  ఇప్పటికే బెల్టు షాపులు రద్దు చేశాం.
  ఆరోగ్య సంరక్షన సేవ కింద రూ.1000
  ప్రతీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్.
  ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గిస్తాం.
  బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనకే అమ్మ ఒడి పథకం.
  Published by:Sulthana Begum Shaik
  First published:June 14, 2019, 09:05 IST