ఏపీ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం... మండలి రద్దు... అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయంటే...

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 0, తటస్థంగా 0 ఓట్లు వచ్చాయి.

news18-telugu
Updated: January 27, 2020, 6:08 PM IST
ఏపీ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం... మండలి రద్దు... అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయంటే...
శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో ఓటింగ్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ అనంతరం సభలో ఓటింగ్ నిర్వహించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారు లేచి నిలబడాలని కోరగా వైసీపీ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. వారిని అసెంబ్లీ సిబ్బంది లెక్కించారు. అనంతరం తీర్మానాన్ని వ్యతిరేకించే వారు లేచి చిలబడాలని స్పీకర్ కోరారు. అయితే, టీడీపీ సభ్యులు ఎవరూ సభకు రాకపోవడంతో ఎవరూ లేచి నిలబడలేదు. అనంతరం తటస్థులు లేచి నిలబడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. అయితే, అప్పుడు కూడా ఎవరూ లేచి నిలబడలేదు. అనంతరం శాసనమండలి రద్దు తీర్మానం 133  ఓట్లతో ఆమోదం పొందిందని స్పీకర్ తెలిపారు. నిబంధనల ప్రకారం సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది శాసనమండలిని రద్దు చేస్తూ అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.

ap assembly,ap capitals,cm ys jagan news,jagan news,jagan plan in assembly,జగన్,జగన్ అసెంబ్లీ,జగన్ న్యూస్,ఏపీ అసెంబ్లీ వార్తలు,
ఏపీ స్పీకర్ తమ్మినేని సీితారాం


సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు ప్రతిష్టాత్మక బిల్లులు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించిన ఐదు రోజులకు కౌన్సిల్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చర్చను ప్రారంభించారు. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. శాసనమండలి సభ్యులు, కేబినెట్ మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు కూడా శాసనమండలి రద్దుకు అనుకూలంగా మాట్లాడారు.

ap assembly, ap legislative council chairman sharif, ఏపీ న్యూస్, ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ఛైర్మన్ షరీఫ్,
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)
చివరగా శాసనసభను ఉద్దేశించి సభానాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ‘ఏపీలో శాసనమండలిని రద్దు చేయడం గర్వంగా ఉంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండళ్లు ఉన్నాయి. మండలి భవిష్యత్ అనేది ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఎలా బతికించుకోవాలన్నదే మన ముందున్న ప్రశ్న. శాసనసభలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. ప్రజాప్రయోజనం లేని మండలి అవసరమా?. శాసనమండలిని ఏర్పాటు చేసుకుని, రద్దు చేసుకునే అధికారం రాజ్యాంగం శాసనసభకు ఇచ్చింది.’ అని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు తరహాలో సింగపూర్, జపాన్, బాహుబలి వంటి మోసపు సినిమాలు చూపించకుండా రాష్ట్ర ఆర్థికపరిస్థితిని వాస్తవంగా అంచనా వేసి ఏం చేయగలమో, ఎంతవరకు చేయగలమో ఆలోచించి మూడు రాజధానులను చేయాలని తాము అనుకోవడం తప్పా అని జగన్ ప్రశ్నించారు.

శాసనమండలి రద్దు తీర్మానంపై చర్చలో ప్రసంగిస్తున్న సీఎం జగన్


ఈ సందర్భంగా గతంలో ప్రధాని మోదీ విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, శాసనమండలి రద్దు విషయంలో చంద్రబాబు ఏమేం వ్యాఖ్యలు చేశారనేది తెలియజేస్తూ కొన్ని వీడియోలను ప్రదర్శించారు.ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం టీడీపీకి 28, వైసీపీకి 9, పీడీఎఫ్ 5, నామినేటెడ్ 8, స్వతంత్రులు 3, బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

  • శాసనమండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు

  • వ్యతిరేకం 0 ఓట్లు

  • తటస్థం 0 ఓట్లు

First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు