Home /News /politics /

ANDHRA PRADESH ASSEMBLY ELECTION RESULT 2019 UPDATES JAGANMOHAN REDDY SWEEPS ANDHRA PRADESH DECIMATES NAIDUS TDP SS

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ స్వీప్... తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

Andhra Pradesh Assembly Election Result 2019 Updates | లోక్‌సభలో హంగ్ ఏర్పడుతుందని, ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని జగన్ అంచనా వేశాడు. మోడీ కూడా ఘన విజయం సాధించడంతో ఇక జగన్‌కు కేంద్రంలో పాత్ర లేదు.

  డీపీ సతీష్, సీనియర్ ఎడిటర్, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్‌లో గాలి తనవైపే వీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు జగన్. భారీ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైఎస్ఆర్‌సీపీకి ఇది అఖండ విజయం. జగన్‌తో పాటు ఆయన మద్దతుదారులు కూడా ఊహించని విజయం. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రత్యర్థి అయిన టీడీపీని తుడిచిపెట్టేశారు. 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు జగన్. తన తండ్రిలాగే జగన్ మడమ తిప్పలేదు. పోరాటాన్ని కొనసాగించారు. కొన్ని నెలల్లోనే బాబు ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు రాష్ట్రమంతా 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఆ కష్టానికి ఫలితం దక్కింది.

   Andhra Pradesh Assembly election result 2019, Andhra Pradesh Assembly election results, Andhra Pradesh election results, election results 2019, TDP, Chandrababu naidu, YS Jagan, YCP, YSRCP, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, టీడీపీ, చంద్రబాబునాయుడు, వైసీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వైఎస్ జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)


  అందరితో అంత కలుపుకోలుగా ఉండరన్న పేరు ఉండేది జగన్‌కు. కానీ తన సన్నిహితుల సలహాలు, సూచనల తర్వాత వ్యూహం మార్చారు. తన శక్తినంతా కూడదీసుకున్నారు. ఎలాగైనా సరే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జనంలోకి వెళ్లారు. చంద్రబాబు అమలు చేసిన ప్రతీ వ్యూహాన్ని జగన్ తన ప్రతివ్యూహంతో ఎదుర్కునేవారు. అలాంటి వ్యూహాలతో చంద్రబాబునాయుడును ఓడించారు జగన్. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రావడం కూడా జగన్‌కు కొంతవరకు కలసివచ్చింది. తమ పార్టీపై ఆరోపణల వర్షం కురిపించిన చంద్రబాబుపై కోపంతో ఉన్న బీజేపీ ఆయన్ను ఓడించేందుకు జగన్‌ విషయంలో సానుకూలంగా వ్యవహరించింది.

  వ్యూహాత్మక కారణాల వల్ల బీజేపీ, వైసీపీ మధ్య ఎలాంటి పొత్తు లేదు. రెండు పార్టీలు వేర్వేరుగా చంద్రబాబుపై దాడి చేశాయి. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా జగన్‌కు మద్దతుగా నిలిచారు. శతృవుగా మారిన పాత స్నేహితుడు చంద్రబాబుతో కొన్ని వ్యక్తిగత లెక్కలు సరిచేసుకోవాలని అనుకున్నారు కేసీఆర్.


   Andhra Pradesh Assembly election result 2019, Andhra Pradesh Assembly election results, Andhra Pradesh election results, election results 2019, TDP, Chandrababu naidu, YS Jagan, YCP, YSRCP, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు, టీడీపీ, చంద్రబాబునాయుడు, వైసీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, వైఎస్ జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


  మరోవైపు జగన్‌కు వ్యూహాలు రచించేందుకు ప్రత్యేకమైన టీమ్‌తో పాటు I-PAC ప్రశాంత్ కిషోర్‌ సపోర్ట్ ఉంది. రెండేళ్ల క్రితం వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల కోసం I-PAC ప్రశాంత్ కిషోర్‌‌ను జగన్ నియమించుకున్నారు. చంద్రబాబునాయుడు హైటెక్ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు I-PAC హైదరాబాద్‌లో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసింది. దీంతో చంద్రబాబునాయుడుకు గట్టిపోటీ ఎదురైంది. ఓటింగ్ రోజునే జగన్ గెలిచాడని I-PAC టీమ్ ప్రకటించింది. ఇక ఓట్ల లెక్కింపు కూడా అవసరం లేదని I-PAC టీమ్ విశ్వాసం చూపించింది. వాళ్లు చెప్పిందే నిజమైంది. లోక్‌సభలో హంగ్ ఏర్పడుతుందని, ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని జగన్ అంచనా వేశాడు. మోడీ కూడా ఘన విజయం సాధించడంతో ఇక జగన్‌కు కేంద్రంలో పాత్ర లేదు.

  జగన్‌కు అధికారం రావడం మాత్రమే కాదు పెద్ద ఎత్తున బాధ్యతలు కూడా వచ్చాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి వనరుల కొరత ఏర్పడింది. అమరావతి నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో కొత్త రాజధాని ఇంకా కలగానే ఉంది. "జగన్ అన్ని వర్గాలకు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో వనరుల కొరత ఉండటంతో ఈ హామీలన్ని నెరవేర్చడం పెద్ద సవాలుగా మారుతుంది" అని జగన్ సన్నిహితులు ఒకరు వ్యాఖ్యానించారు.


  కొన్నేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సొంత కాంగ్రెస్ పార్టీ జగన్‌ను జైలుకు పంపింది. అవమానాలకు గురిచేసింది. అలాంటి పరిస్థితుల నుంచి జగన్ పుంజుకున్నారు. ఎనిమిదేళ్లలో అధికారం చేపట్టారు. రాష్ట్రంలో తన ఏకైక ప్రత్యర్థి చంద్రబాబునాయుడు వయస్సు ప్రస్తుతం 69 ఏళ్లు. 2024 నాటికి 74 ఏళ్లు వస్తాయి. కానీ జగన్ వయస్సు ప్రస్తుతం 46 ఏళ్లు. వయస్సు కూడా జగన్‌కే సహకరిస్తుంది.

  నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి


  ఇవి కూడా చదవండి:

  Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

  IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

  PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Lok Sabha Elections 2019, Tdp, Ycp, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు